బార్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-09-26T10:51:12+05:30 IST

కరోనా నేపథ్యంలో మూ తపడ్డ బార్‌లను తెరిచేం దుకు ప్రభుత్వం అనుమ తించింది. ఈ మేరకు శుక్ర వారం ఉత్తర్వులు విడుదల చేసింది. 188 రోజుల తర్వాత బార్‌లు

బార్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ఉదయం, సాయంత్రం పరిసరాలను శానిటైజ్‌ చేయాలి

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, వెంటనే అమల్లోకి..


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కరోనా నేపథ్యంలో మూ తపడ్డ బార్‌లను తెరిచేం దుకు ప్రభుత్వం అనుమ తించింది. ఈ మేరకు శుక్ర వారం ఉత్తర్వులు విడుదల చేసింది. 188 రోజుల తర్వాత బార్‌లు తెరుచుకోనున్నాయి. బార్లను తెరి చేందుకు ప్రభుత్వం అనుమతించడంతో మద్యం ప్రి యుల్లో కొంత ఆనందం వ్యక్తం అవుతున్నది. అయి తే బార్‌లల్లో కరోనా సోకకుండా, వ్యాప్తి చెందకుం డా ఉండేందుకు కొవిడ్‌ నిబంధనలను అనుసరించా లని ఉత్తర్వుల్లో పేర్కొంది. బార్‌లకు అనుమతించిన ప్రభుత్వం వైన్‌షాపుల్లో గల పర్మిట్‌ రూములను తెరి చేందుకు మాత్రం అనుమతించలేదు. 


జిల్లాలో 14 బార్లు..

పెద్దపల్లి జిల్లాలో మొత్తం 14 బార్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో 4, గోదావరిఖని ప్రాంతంలో 10 బా ర్లు ఉన్నాయి. చివరిసారిగా మార్చి 21 వరకు బార్లు నడిచాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ దేశాన్ని కూడా కుదిపేసింది. మార్చి 22న ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛంద బంద్‌కు పిలుపు నిచ్చారు. అదేరోజు రాత్రి సీఎం కేసీఆర్‌ మరుసటి రోజు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి బార్‌లు మూత పడ్డా యి. లాక్‌డౌన్‌ను అంచలంచెలుగా ఎత్తివేసినప్పటికీ కొన్నింటిపై నిషేధం అమల్లో ఉన్నాయి. బార్‌లు, సిని మా హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, విద్యా సంస్థలను తెర వకూడదని ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నా రు. బార్‌లు తెరిచేందుకు అనుమతినిస్తూ శుక్రవా రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి తక్షణమే అమ ల్లోకి వస్తాయని పేర్కొంది. 


బార్‌లోకి వచ్చే వారికి ప్రవేశ ద్వారం వద్దనే థర్మ ల్‌ స్ర్కీనింగ్‌ చేయాలని, బార్‌ ప్రాంగాణం, పరిసరా లను ఉదయం, సాయంత్రం శానిటైజ్‌ చేయాలని, బార్‌లో పనిచేసే సిబ్బంది, బార్‌కు వచ్చేవాళ్లు అంద రూ మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకో వా లని పేర్కొన్నారు. మందు తాగిన వెంటనే వారు కూ ర్చున్న కుర్చీలు, టేబుళ్లను మరొకరు కూర్చునేందుకు వీలుగా శానిటైజ్‌ చేయాలన్నారు. హ్యాండ్‌ శానిటై జర్‌ను అందుబాటులో ఉంచాలని, బార్‌లలో మ్యూజి కల్‌ ఈవెంట్స్‌, డ్యాన్సులు వంటివి నిర్వహించరాదని, ఈ నిబంధనలన్నింటినీ పాటించాలని పేర్కొన్నారు. 


మందుబాబులతోనే తిప్పలు..

బార్‌లు మూతపడిన నాటినుంచి సామూహికం గా మందు విందులు జరగడం లేదు. ఎవరికి వారు గా ఇళ్లల్లోనే మందు తాగుతున్నారు. గుమిగూడడం గానీ, భౌతిక దూరం పాటించకుంటే కరోనా వస్తుం దనే ప్రభుత్వం ఇన్నాళ్లు బార్‌ షాపులను మూసి వేసింది. వైన్‌షాపుల్లో పర్మిట్‌ రూములను తెరవక పోవడంతో మందు బాబులు ఆ వైన్‌ షాపు పక్కనే నిలబడి మందు కొడుతున్నారు. దీంతో చాలా మం ది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైన్‌ షాపుల వద్ద మందు సేవించకుండా ఉండేందుకు ఎక్సైజ్‌ శాఖాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. బార్‌ల ను తెరిచినా కూడా గతంలో ఉన్నంత గిరాకీ ఉండ కపోవచ్చని తెలుస్తున్నది. సాధారణంగా బార్‌కు ముగ్గురు, నలుగురు కలిసే ఎక్కువగా వెళు తుంటా రు. బార్‌లలో నిర్వహిస్తున్న జనతా బార్‌లకు ఎక్కు వగా సింగిల్‌గా వచ్చే వాళ్లే ఉంటారు. వారితో కొంత మేరకు గిరాకీ పెరగవచ్చు. 

Updated Date - 2020-09-26T10:51:12+05:30 IST