ఆరు కంపెనీల ఐపీఓకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2021-07-27T21:38:18+05:30 IST

విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌తో పాటు మరో ఐదు కంపెనీల పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనలకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి(సెబీ) ఆమోదం వ్యక్తం చేసింది.

ఆరు కంపెనీల ఐపీఓకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌తో పాటు మరో ఐదు కంపెనీల పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రతిపాదనలకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి(సెబీ) ఆమోదం వ్యక్తం చేసింది. విజయా డయాగ్నోస్టిక్స్‌తో పాటు కార్‌ట్రేడ్‌ టెక్‌, సుప్రియా లైఫ్‌ సైన్సెస్‌, ఆప్టస్‌ వేల్యూ హౌసింగ్‌ ఫైనాన్స్‌, క్రిష్ణా డయాగ్నోస్టిక్స్‌, అమీ ఆర్గానిక్స్‌ ఉన్నాయి. ఈ ఆరు కంపెనీలు మే-జూన్‌ మధ్య కాలంలో సెబీకి ఐపీఓ ప్రతిపాదనలందించాయి.


వాటిని... జూలై 19-23 మధ్య కాలంలో పరిరశీలించి ఆమోదం తెలిపామని సెబీ వెల్లడించింది. ఐపీఓలో భాగంగా కేదారా క్యాపిటల్‌, కారకోరమ్‌‌కు చెందిన 3.57 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్ఎస్‌) ప్రాతిపదికన విజయ డయాగ్నోస్టిక్‌ ప్రమోటర్లు విక్రయించనున్నారు. కంపెనీ 35 శాతం వాటాకు ఈ షేర్లు సమానం కావడం గమనార్హం. విజయా డయాగ్నస్టిక్ సెంటర్‌లో కేదారా క్యాపిటల్ 2016 లో 40 శాతం వాటాను రూ. 400 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందులో 30 శాతం వాటాను కేదారా క్యాపిటల్‌ ఉపసంహరించుకోనుంది. విజయా డయాగ్నస్టిక్స్‌కు... దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి. అలాగే ఆప్టస్ వాల్యూ యొక్క ఐపీఓలో ఈక్విటీ షేర్ల మొత్తం రూ. 500 కోట్లు కాగా, ప్రమోటర్, ఇప్పటికే ఉన్న వాటాదారులచే 64,590,695 వరకు ఈక్విటీ షేర్లను విక్రయించే ఆఫర్ ఉందని డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ పేర్కొంది. 

Updated Date - 2021-07-27T21:38:18+05:30 IST