హరిత తెలంగాణే లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-25T04:16:24+05:30 IST

హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోం దని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

హరిత తెలంగాణే లక్ష్యం
అర్బన్‌ ఎకో పార్కులో మొక్క నాటుతున్న మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌/మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం), జూలై 24 : హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోం దని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మది నం సందర్భంగా శనివా రం మహబూబ్‌నగర్‌లోని కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పా ర్క్‌, వీరన్నపేట నుంచి డ బుల్‌ బెడ్‌ రూమ్‌ వరకు రహదారికి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌, వీర న్నపేటలోని పది ఎకరాల బృహత్‌ ప్రకృతివనంలో, ప్రభుత్వ జనరల్‌ ఆసుప త్రిలో మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు మానవాళికి కావాలసిన స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను మొక్కలు అందిస్తాయని చెప్పారు. మహిళా సంఘాలు రెం డు కోట్ల విత్తన బంతులు తయారు చేసి, వాటిని వెదజల్లి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించారని గుర్తు చేశారు. కార్యక్రమాల్లో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషినల్‌ కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవార్‌, సీతా రామారావు, డీఎఫ్‌వో గంగారెడ్డి, వ్యవసాయ అధికారి సుచరిత, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు,  రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెక్కం జనార్దన్‌, వైస్‌ చైర్మన్‌ శ్యామ్యూల్‌, రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని వెంకటయ్య, నీరజ,  షబ్బీర్‌అలీ, ప్రవీణ్‌కుమార్‌, రాము, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:16:24+05:30 IST