పచ్చని తెలంగాణే లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-25T04:22:02+05:30 IST

పచ్చని తెలంగాణే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

పచ్చని తెలంగాణే లక్ష్యం
గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో మొక్కను నాటుతున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం

- కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గ్రామాల్లో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు

గద్వాలక్రైం/ఉండల్లి/మల్దకల్‌/వడ్డేపల్లి/ధరూరు/అయిజటౌన్‌/ఎర్రవల్లి/ గద్వాలటౌన్‌/గద్వాలరూరల్‌/ కేటీదొడ్డి/గట్టు/అలంపూర్‌/రాజోలి, జూలై 24 : పచ్చని తెలంగాణే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శనివారం రాష్ట్రంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్ర మాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ఎమ్మెల్యే  మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవకే అంకితమయిన జననేత కేటీఆర్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేటీఆర్‌ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆక్షాంక్షించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్‌ఎంవో వృశాలి, మునిసిపల్‌  చైర్మన్‌ బి.ఎస్‌.కేశవ్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్‌ పర్సన్‌ రాజేశ్వరమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు సుభాన్‌,  గట్టు తిమ్మప్ప, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

- ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం మల్దకల్‌ మండలం పెద్దొడ్డి గ్రామంలో   మొక్కలు నాటారు. హరితహారం కార్యక్ర మంలో భాగంగా 1000 మొక్కలు నాటిన ట్లు  ఎక్సైజ్‌ సీఐ గోపాల్‌  తెలిపారు. కార్య క్రమంలో ఎక్సైజ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, స్ధానిక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ శేఖర్‌, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. 

ఉండవల్లిలో..

రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి కేటీఆర్‌  కీలకపాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. శనివారం కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని ఇటిక్యాలపాడు గ్రామంలో  హరితహారం నిర్వహిం చా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహాం, సర్పంచు లో కేశ్వర్‌ రెడ్డి మొక్కలు నా టారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బీసమ్మ ఆధ్వ ర్యంలో కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు. అలంపూర్‌ మైనార్టీ గురుకుల బాలికల విద్యాలయంలో ప్రిన్సిపాల్‌ వజ్ర మ్మ, అధ్యాపకులు,  విద్యార్థిను లు మొక్కలు నాటి నీరు పోశారు.  కార్యక్రమంలో ఎంపీడీవో జెమ్లానా య క్‌, ఎస్సై జగన్‌మోహన్‌, వైస్‌ ఎంపీపీ దేవన్న, ఎంపీటీసీ సభ్యు డు సుంకన్న, కోఆప్షన్‌ మెంబర్‌ చిన్న బాషుమియ్య, టీ ఆర్‌ఎస్‌ నాయకులు నరసింహా, వెంకట్‌గౌడ్‌, తేజ, నత్త నియేలు, వెంకటేశ్వర్లు, రమణ, కృష్ణగౌడ్‌ పాల్గొన్నారు.

- మల్దకల్‌ మండల పరిషత్‌ కార్యాలయం లో ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌ రెడ్డి మొక్కలు నాటారు. శాంతినగర్‌లో  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణ మొక్కలు నాటారు. ధరూరు మండలంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మొక్కలు నాటారు. క ల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.  అ యిజలోని ప్రభుత్వ అథితి గృహం దగ్గర  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి మొక్కలను నాటారు.  ఇటిక్యాల మండలం కొండేరు గ్రామంలోని ఆరోగ్యఉపకేంద్రం దగ్గర మాజీ ఎంపీ మంద జగన్నాథం కేక్‌ కట్‌ చేసి  మొక్కలు నాటారు.  అలాగే జింకలపల్లి స్టేజీ దగ్గర ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో జడ్పీటీసీ సభ్యుడు  హనుమంతు రెడ్డి మొక్కను నాటారు.  గద్వాల  మునిసిపల్‌ కార్యాలయం ఆవరణలో మునిసిపల్‌ చైర్మన్‌ బీ.ఎస్‌. కేశవ్‌ మొక్కలు నాటి నీరు పోశారు.  గద్వాల మండల పరిధిలోని  కొండపల్లి గ్రామంలో ఎంపీపీ ఆల్వాల్‌ ప్రతాప్‌ గౌడ్‌,  సర్పంచు మహేశ్వరమ్మ కేక్‌ కట్‌ చేశారు. అదేవిధం గా కొత్తపల్లిలో  సర్పంచు అశోక్‌రెడ్డి గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు.  కేటీదొడ్డి, గట్టులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి మొక్కలు నాటారు. అలంపూర్‌లో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ  మొ క్కలు నాటారు.  అలాగే దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన లు చేశారు. రాజోలిలో ఎంపీపీ మరియమ్మ ఆధ్వర్యంలో కేటీఆర్‌ జన్మ దిన వేడుకలు నిర్వహించారు. 



Updated Date - 2021-07-25T04:22:02+05:30 IST