పర్యావరణ సమతుల్యతకే హరితహారం

ABN , First Publish Date - 2022-06-06T04:58:33+05:30 IST

పర్యావరణ సమతుల్యత కోసమే హరితహారం పథకంలో ఉద్యమంలా మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ తెలిపారు.

పర్యావరణ సమతుల్యతకే హరితహారం
మొక్క నాటి నీళ్లు పోస్తున్న ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌

- 33 శాతం అడవుల పెరుగుదలే లక్ష్యం

- నాటిన మొక్కలను సంరక్షించాలి

- ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌


కల్వకుర్తి, జూన్‌ 5: పర్యావరణ సమతుల్యత కోసమే హరితహారం పథకంలో ఉద్యమంలా మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ తెలిపారు. ప్రతీ ఒక్కరు విధిగా 5 మొక్కలు నాటి వాటిని కాపాడాలని ఎమ్మెల్యే పిలు పునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్క రించుకొని కల్వకుర్తి పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన గ్రీన్‌వాక్‌ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. హరితహా రంలో రాష్ట్రంలో కల్వకుర్తిని మొదటిస్థానంలో నిలవ డం పట్ల మునిసిపల్‌ చైర్మన్‌ సత్యంను ఎమ్మెల్యే స న్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఆవ రణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.  అనంతరం ఎ మ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ అడవులు అంతరించి పోవడంతో ఓజోన్‌పొర దెబ్బతిని మానవా ళి మనుగడకు ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సం క్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచా యని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల కు ప్రజలు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపుని చ్చారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ ఠాగూర్‌ బాలాజీసింగ్‌,  ము నిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, వైస్‌చైర్మన్‌ షాహిద్‌, ము నిసిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు బా లునాయక్‌, బోజ్‌రెడ్డి, సూర్యప్రకాష్‌రావు,  రవీందర్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు మనోహరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, మధు, తహేర్‌అలి, వందేమాతరం పౌండేషన్‌ కార్యదర్శి మాధవరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, డైరక్టర్‌ రాము, మార్కెట్‌ చైర్మన్‌ బాలయ్య, ఆప్షన్‌ సభ్యుడు రుక్మాదిన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పర్వత్‌రెడ్డి, శ్రీధర్‌, రవిందర్‌, రవి, శివ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-06T04:58:33+05:30 IST