హరితహారంలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2021-06-23T06:30:20+05:30 IST

ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆర్డీవో రాజేంద్రకుమార్‌ అన్నారు.

హరితహారంలో భాగస్వాములు కావాలి
ఆత్మకూర్‌(ఎస్‌)లో ప్రకృతి వనం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో రాజేంద్రకుమార్‌

ఆత్మకూర్‌(ఎస్‌), జూన్‌ 22 : ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆర్డీవో రాజేంద్రకుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో మెగా పల్లె ప్రకృతి వనం కోసం స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం మండలంలోని కోట్యానాయక్‌తండా సమీపంలోని శ్రీరాంసాగర్‌ ప్రధాన కాల్వకు ఇరువైపులా ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు ఏనుబాముల గ్రామ రోడ్డు సమీపంలో డబల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి భూమిని సర్వే చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్ధార్‌ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్లు వెంకటేశ్వర్లు, మాన్యానాయక్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


నడిగూడెం : మండలానికో మెగా ప్రకృతి వనాన్ని ఏర్పాటుచేసేందుకు స్థల సేకరణ చేపట్టినట్లు ఉపాధిహామీ పథకం ఏపీడీ డాక్టర్‌ పి.పెంటయ్య తెలిపారు. నారాయణపురంలో ప్రకృతి వనం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ స్థానిక బోడిగుట్ట వద్ద 38ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, అం దులో 10ఎకరాల స్థలంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి 40వేల మొక్కలు పెంచనున్నట్లు తెలిపారు.  నారాయణపురం మెగాపార్కు జిల్లాలోనే ఆదర్శంగా ఉంచేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎం పీడీవో శాంతకుమారరి, ఎంపీవో లింగారెడ్డి ఉన్నారు. 


అర్వపల్లి: మండల కేంద్రంలో మెగా పల్లె ప్రకృతి వనం కోసం స్థలాన్ని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు. అన్నిగ్రామాలకు ఆదర్శంగా ఉండేలా మెగా మెగా వనాన్ని ఏర్పాటుచేయడానికి దేవాలయ భూములను పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటి తహసీల్ధార్‌ హరిచందర్‌, ఆర్‌ఐ కర్ణాకర్‌, వీఆర్‌వో వెంకన్న, వీఆర్‌ఏలు విజయ్‌ పాల్గొన్నారు. 


తిరుమలగిరి రూరల్‌: మామిడాల గ్రామంలో మెగా ప్రకృతి వన ప్రతిపాదిత స్థలాన్ని తహసీల్దార్‌ సంతో్‌షకిరణ్‌, ఎంపీడీవో ఉమే్‌షచారి పరిశీలించారు. గ్రామంలోని 107 సర్వే నెంబరులోని 10 ఎకరాల్లో మెగా వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వారి వెంట సర్పంచ్‌ కరుణాకర్‌, కార్యదర్శి అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T06:30:20+05:30 IST