పచ్చదనం..‘ప్రగతి’ పథం

ABN , First Publish Date - 2021-06-21T05:42:11+05:30 IST

పెందుర్తిలో గల మహిళా ప్రగతి కేంద్రం ప్రాంగణంలో పచ్చదనం పరిఢవిల్లుతోంది. ఆ ప్రాంతమంతా గ్రీనరీతో కళకళలాడుతోంది.

పచ్చదనం..‘ప్రగతి’ పథం
టీటీడీసీలో పూల సోయగం

మహిళా ప్రగతి కేంద్రం ప్రాంగణంలో పచ్చదనం కనువిందు

ఆకట్టుకుంటున్న పూల సోయగాలు

పెందుర్తి, జూన్‌ 20: పెందుర్తిలో గల మహిళా ప్రగతి కేంద్రం ప్రాంగణంలో పచ్చదనం పరిఢవిల్లుతోంది. ఆ ప్రాంతమంతా గ్రీనరీతో కళకళలాడుతోంది. ప్రవేశ ద్వారం నుంచే అశోక వృక్షాలు స్వాగత ద్వారాలుగా ఆహ్వానం పలుకుతున్నట్టు ఉంటాయి. వివిధ  పుష్ప జాతుల పూలు సోయగాలు ఆకట్టుకుంటున్నాయి. సుమారు 7.50 ఎకరాలు విస్తీర్ణం గల ఈ ప్రగతి కేంద్రంలో ట్రైనింగ్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (టీటీడీసీ)తో పాటు వివిధ కార్యాలయ భవనాలు, లాన్‌ అంతా పచ్చదనం పరుచుకుంది. ఇక్కడ గల క్రోటాన్‌, తూజ, ఎగ్జోరా గ్రీన్‌ గడ్డి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. లాన్‌లో టీటీడీసీ అని ఇంగ్లిష్‌ అక్షరాలు కనువిందు చేస్తున్నాయి. మొక్కల సంరక్షణకు ఇక్కడి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 

సిబ్బంది కొరతతో భారంగా నిర్వహణ

మహిళా ప్రగతి కేంద్రంలో పచ్చదనం పరిరక్షణకు గతంలో 20 మంది సిబ్బంది పని చేసేవారు. ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. దీని వల్ల మొక్కల సంరక్షణ కష్టమవుతోంది. ప్రగతి కేంద్రంలోని సమావేశ మందిరంలో అధికార, ఇతర సమావేశాలు నిర్వహించినప్పుడు తద్వారా లభించే ఆదాయంతో గార్డెనింగ్‌ సిబ్బందికి వేతనాలు ఇచ్చేవారు. కొవిడ్‌ కారణంగా శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించకపోవడంతో ఆదాయం లేక సిబ్బంది జీతాలు చెల్లించడం భారంగా మారింది. 

Updated Date - 2021-06-21T05:42:11+05:30 IST