Abn logo
Jun 16 2021 @ 03:44AM

పచ్చదనాన్ని పెంచాలి.. ప్రకృతి మాతను రక్షించాలి: సీజేఐ రమణ

గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటిన సీజేఐ

హైదరాబాద్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ప్రకృతి మాతను కాపాడుకునేందుకు పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. భవిష్యత్తు తరాల సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడేందుకు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన మేరకు పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని పెంచడం ఒక అలవాటుగా చేసుకోవాలని న్యాయ వ్యవస్థకు పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం రాజ్‌భవన్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణ ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా గ్రీన్‌ ఇండియా కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా మార్గదర్శకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌, సీనియర్‌ న్యాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణకు వృక్షవేదం పుస్తకాన్ని జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ బహూకరించారు.