గ్రీటింగ్‌ బాయ్స్‌!

ABN , First Publish Date - 2020-12-27T05:56:22+05:30 IST

పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారు. అందుకు ఉదాహరణ ‘స్నేహఘర్‌’ హోమ్‌ విద్యార్థులు.

గ్రీటింగ్‌ బాయ్స్‌!

పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారు. అందుకు ఉదాహరణ ‘స్నేహఘర్‌’ హోమ్‌ విద్యార్థులు. వాళ్లు తయారుచేసిన గ్రీటింగ్‌ కార్డులను చూసి హీరో విజయ్‌ దేవరకొండ సైతం మెచ్చుకున్నారు. ఆ విశేషాలివి...


 స్నేహఘర్‌ హోమ్‌ పిల్లలు డిజైనర్‌ గ్రీటింగ్‌ కార్డుల తయారీలో నేర్పరులు. ఈ మధ్య బాలభవన్‌ వారు అందమైన గ్రీటింగ్‌ కార్డులు రూపొందించిన పిల్లలకు బహుమతులు ఇస్తామని ప్రకటించారు. దాంతో ఈ పిల్లలు కార్డుల తయారీకి పూనుకున్నారు.


 పిల్లలందరూ నాలుగు గ్రూపులుగా ఏర్పడి కేవలం మూడు నాలుగు గంటల వ్యవధిలో చూడచక్కని డిజైనర్‌ గ్రీటింగ్‌ కార్డులు రూపొందించారు. రంగురంగుల పేపర్లు, స్టోన్స్‌, చార్టులు ఉపయోగించి ఆకట్టుకునేలా వీటిని తయారుచేశారు.


 ఇటీవల విజయ్‌ నగర్‌ కాలనీ స్నేహఘర్‌ హోమ్‌లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ వాటర్‌ ప్యూరిఫయర్‌ను ప్రారంభించడానికి వచ్చిన వారికి ఆ గ్రీటింగ్‌ కార్డులు బహుకరించారు. ముచ్చటైన గ్రీటింగ్‌ కార్డులు తయారుచేసిన  పిల్లలను వారంతా ప్రశంసలతో ముంచెత్తారు.


 ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండకు సైతం స్నేహ ఘర్‌  పిల్లలు చేసిన గ్రీటింగ్‌కార్డులు బాగా నచ్చాయి. క్రిస్మస్‌ సందర్భంగా ఆయన వారికి గిఫ్టులు, స్వీట్లు పంపారు. తన ఫౌండేషన్‌ ద్వారా వారికి కొత్త దుస్తులు కూడా అందజేశారు. అంతేకాదు వీడియో కాల్‌ చేసి అందరితో ఆత్మీయంగా మాట్లాడారు కూడా.

  

 ఈ సందర్భంగా తనకు పిల్లలు బహూకరించిన గ్రీటింగ్‌ కార్డును చూసి విజయ్‌ దేవరకొండ వారిని మనసారా అభినందించారు.  

Updated Date - 2020-12-27T05:56:22+05:30 IST