బఫెట్‌ వారసుడు గ్రెగ్‌ అబెల్‌

ABN , First Publish Date - 2021-05-04T06:34:35+05:30 IST

బెర్క్‌షైర్‌ హాత్‌వే ఇంక్‌.. కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) ఎవరనే ఊహాగనాలకు ఇన్వెస్టర్‌ మాంత్రికుడు వారెన్‌ బఫెట్‌ తెరదించారు. ప్రస్తుతం కంపెనీ వైస్‌ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్‌ అబెల్‌.. సీఈఓ స్థానాన్ని...

బఫెట్‌ వారసుడు గ్రెగ్‌ అబెల్‌

న్యూయార్క్‌: బెర్క్‌షైర్‌ హాత్‌వే ఇంక్‌.. కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) ఎవరనే ఊహాగనాలకు ఇన్వెస్టర్‌ మాంత్రికుడు వారెన్‌ బఫెట్‌ తెరదించారు. ప్రస్తుతం కంపెనీ వైస్‌ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్‌ అబెల్‌.. సీఈఓ స్థానాన్ని అలంకరిస్తారని బఫెట్‌ వెల్లడించారు. అబెల్‌ ప్రస్తుతం బఫెట్‌ నిర్వహణలోని బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్‌యేతర వ్యాపారాలు చూస్తున్నారు. ‘ఈ రాత్రికి నాకు ఏమైనా జరగరానిది జరిగితే రేపు ఉదయమే గ్రెగ్‌ అబెల్‌.. బెర్క్‌షైర్‌ కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. దీనిపై మా కంపెనీ డైరెక్టర్ల మధ్య ఒప్పందం ఉంది’ అన్నారు. ఒకవేళ అబెల్‌కు కూడా ఏమైనా జరగరానికి జరిగితే కంపెనీ ఇన్సూరెన్స్‌ వ్యాపారం చూస్తున్న ప్రవాస భారతీయుడు అజిత్‌ జైన్‌.. బెర్క్‌షైర్‌ సీఈఓ అవుతారని బఫెట్‌ చెప్పారు.  

Updated Date - 2021-05-04T06:34:35+05:30 IST