మటన్ కర్రీ తెచ్చిన తంటా.. పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. ఆ మర్నాడే..

ABN , First Publish Date - 2021-06-24T23:21:57+05:30 IST

పెళ్లి విందులో మటన్ కర్రీ వడ్డించలేదని ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకున్నాడు ఓ యువకుడు.

మటన్ కర్రీ తెచ్చిన తంటా.. పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. ఆ మర్నాడే..

పెళ్లి విందులో మటన్ కర్రీ వడ్డించలేదని ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకున్నాడు ఓ యువకుడు. అంతేకాదు ఆ మరుసటి రోజే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తోడు పెళ్లి కొడుకు, ఇతర బంధువులు హాజరయ్యారు. తోడు పెళ్లి కొడుకు తనకు మేక మాంసం కావాలని అడిగాడు. అయితే ఆ విందులో మేక మాంసం లేదు. ఆ విషయం చెప్పగానే వరుడి తరఫు వారు ఆగ్రహానికి గురయ్యారు. అది చినికి చినికి గాలి వానగా మారింది. చివరకు పెళ్లి కొడుకు పెళ్లిని రద్దు చేసుకుని తన వారితో కలిసి బయటకు వచ్చేశాడు. ఆ మరుసటి రోజే మరో యువతి మెడలో మూడు ముళ్లూ వేసేశాడు. 

Updated Date - 2021-06-24T23:21:57+05:30 IST