Viral Video: పెళ్లి బంధంతో అప్పుడే ఒక్కటైన జంట.. వధువు పక్కనే కూర్చుని వరుడు ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2021-10-22T23:45:25+05:30 IST

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో.. మేళతాళాల మధ్య పెళ్లి బంధంతో ఒక్కటైన ఓ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి అనంతరం భార్య పక్కనే కూర్చున్న ఆ వరుడు చేసిన పనిపై నెటిజన్లు రకర

Viral Video: పెళ్లి బంధంతో అప్పుడే ఒక్కటైన జంట.. వధువు పక్కనే కూర్చుని వరుడు ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో.. మేళతాళాల మధ్య పెళ్లి బంధంతో ఒక్కటైన ఓ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి అనంతరం భార్య పక్కనే కూర్చున్న ఆ వరుడు చేసిన పనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకూ భార్య పక్కనే కూర్చుని ఆ వరడు ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే..



ఇద్దరు యువతి, యువకులు ఒకరికొకరు నచ్చారు. దీంతో ఇరు కుటుంబ సభ్యలు ఆ యువతి, యువకుడికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ యువతి, యుకువడు మేళతాళాల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం అక్కడి సంప్రదాయం ప్రకారం.. నవ వధువు బంధువుల సమక్షంలో వంట చేసేందుకు రెడీ అయింది. అందులో భాగంగానే అందరూ చూస్తుండగానే రోటీని తయారు చేసి, పొయ్యిపై ఉన్న పెనంపై వేసింది. ఈ క్రమంలో పక్కనే ఆ నవ వధువు పక్కనే కూర్చున్న పెళ్లి కొడుకు.. రోటీ చేయడంలో తన భార్యకు సహాయం చేశాడు. పెనంపై వేసిన రోటీని.. ఇటూ ఇటూ తిప్పుతూ కాల్చాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 






Updated Date - 2021-10-22T23:45:25+05:30 IST