Advertisement
Advertisement
Abn logo
Advertisement

కల్యాణమండపంలో ఆమెను చూసినవారంతా పెళ్లికూతురు అనుకుని విష్ చేశారు.. తీరా విషయం తెలిసి.. తెగ ఆశ్చర్యపోయారు

ఎవరికైనా సరే పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే అంశం. బ్రిటన్‌లో జరిగిన ఒక పెళ్లి గురించి తెలిస్తే ఎంతటివారైనా ఆశ్చర్యపోవాల్సిందే. కుమారుని వివాహానికి.. తల్లి పెళ్లికూతురి ముస్తాబులో కల్యాణమండపానికి వచ్చింది. దీంతో అక్కడున్న అతిథులంతా ఆమెనే చూస్తూ నిలుచుండిపోయారు. కొందరు ఈమెనే పెళ్లి కుమార్తె అయివుంటుందని అనుకున్నారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఒక పెళ్లి వేడుకలో వరుని తల్లి తళతళా మెరిసిపోతున్న తెల్లని గౌను ధరించి, అందంగా ముస్తాబై వచ్చింది. ఆమె అచ్చం పెళ్లికుమార్తెలానే కనిపించింది. వివాహ వేడుకకు వచ్చినవారంతా ఆమెనే పెళ్లికుమార్తె అనుకుని ఆమెకు అభినందనలు చెప్పారు. అయితే కొద్దిసేపటి తరువాత ఆమెకు విషయం అర్థం అయ్యింది. తనను అందరూ పెళ్ళికుమార్తె అనుకుంటున్నారని గ్రహించింది. ఆమె వైట్ గౌన్ మాత్రమే ధరిస్తే అందరూ అలా అనుకునేవారు కాదు. కానీ ఆమె వధువుకు చేయాల్సిన అలంకరణలన్నీ చేసుకుంది. ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌ చేయించుకోవడంతో పాటు నెయిల్స్‌కు వైట్ కలర్ వేసుకుంది. దీంతో అందరూ ఆమెను నవవధువు అనుకున్నారు. ఈమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement