Advertisement
Advertisement
Abn logo
Advertisement

శభాష్ సృజన్.. పెళ్లిలో వరుడు చేసిన పనికి అవాక్కైన వధువు తండ్రి.. పెళ్లిమండపంలో హాట్ టాపిక్..!

లక్షలు వరకట్నంగా తీసుకొని పెళ్లిచేసుకోవడం ఈ రోజుల్లో మామూలు విషయమైపోయింది. అలాంటివారికి పెళ్లంటే కేవలం డబ్బు కూడబెట్టడానికి ఒక మార్గం. కానీ కొంతమంది కట్నంకాదు,  అమ్మాయి ముఖ్యమని భావించేవారూ ఉన్నారు. ఇలాంటి వాళ్లు పెళ్లిని ఒక అందమైన బంధంగా భావిస్తారు.


ఉత్తర్ ప్రదేశ్‌లోని మహోబా నగరానికి చెందిన సృజన్ ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి విద్యుత్ కార్యాలయంలో పెద్ద పదవి పనిచేసి రిటైర్ అయ్యారు. సృజన్ పెళ్లి ఛతర్‌పూర్‌లో నివసించే విపిన్ బిహారి కుమార్తె అన్షికాతో నిశ్చయమైంది. విపిన్ బిహారి తహసిల్దార్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. సమాజంలో అందరూ అమ్మాయి పెళ్లికి కట్నం ఇస్తుంటారు. విపిప్ బిహారి కూడా అలాగే ఇవ్వాలని భావించాడు.


సృజన్‌తో అన్షికా పెళ్లి నిశ్చయం చేసే సమయంలో అమ్మాయి తండ్రి అయిన విపిన్ బిహారి కట్నం ఎంత ఆశిస్తున్నారో పెళ్లికొడుకు తండ్రిని అడిగాడు. కానీ ఆ పెద్దమనిషి తరువాత చూద్దాం అని మాటదాటేశాడు. విపిన్ బిహారికి విషయం అర్థం కాలేదు. సరే మంచి సంబంధం అనుకొని అలాగే అన్నాడు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.


ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగే రోజు విపిన్ బిహారి అందరి ముందు తన అల్లుడికి ఒక పెద్ద పళ్లెంలో కొన్ని వెండి నాణేలతోపాటు 6 లక్షల రూపాయలు కానుకగా ఇవ్వబోయాడు. కానీ సృజన్‌కి కట్నం తీసుకోవాలని ఆశలేదు. కానీ కానుకని తిరస్కరించడం మంచిది కాదని భావించాడు. అందుకోసం తన మామగారు ఇచ్చిన ఆ పళ్లెం లోనుంచి ఒక నాణెం మాత్రమే తీసుకొన్నాడు. తనకు కట్నం వద్దని.. ఇచ్చిన కానుకలో ఒక నాణెం చాలునని అన్నాడు. కట్నం కింద మీ అమ్మాయి చాలు అని చెప్పాడు. దీంతో అక్కడున్న అతిథులందరూ చప్పట్లు కొట్టారు. పెళ్లికూతురి తండ్రి కూడా తనకు బంగారం లాంటి అల్లుడు దొరికాడని సంతోషంచి.. సృజన్‌ని కౌగిలించుకున్నాడు.


కానీ తన కూతురి సంతోషం కోసం కట్నం ఇవ్వల్సిందేని విపిన్ బిహారి భావించి ఆ డబ్బు, వెండి నాణేలతో నిండిన పళ్లెం తీసుకొని సృజన్ తండ్రికి ఇవ్వబోయాడు. అప్పుడు ఆ పెద్దమనిషి కూడా తమకు కట్నం ముఖ్యం కాదు, అమ్మాయి ముఖ్యమని అన్నారు. "మీరు మీ అమ్మాయిని మాకిస్తున్నారు అంతకంటే మాకేమీ అవసరం లేదు. మా అబ్బాయి తన సంపాదనతో మీ అమ్మాయిని సంతోషంగా పోషించగలడు, మరి అలాంటప్పుడు మేము ఈ డబ్బు తీసుకొని ఏం చేయాలి.. మాకు ఈ కట్నం అవసరంలేదని" అని అన్నారు.


ఇది విన్న విపిన్ బిహారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తన కూతురు అన్షికా వద్దకు వెళ్లి.. "అమ్మా నీకు మంచి భర్తే కాదు.. మంచి అత్తారిల్లు కూడా లభించింది.. నీవెప్పుడు వారి ఇంటి పురువును ఇలాగే కొనసాగించు," అని ఆశీర్వదించాడు. ఇది చూసిన అతిథులంతా శభాష్ సృజన్ అని అన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement