Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేమిస్తున్నానంటూ ఆమెకు వల వేశాడు.. పెళ్లి చేసుకుని నిజ స్వరూపం బయటపెట్టాడు.. ఊహించని ట్విస్ట్ ఎదురయ్యేసరికి..

హరియాణాలోని సిర్సా జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఉదంతం సంచలనంగా మారింది. నవ వధువును వదిలేసి కెనడా పారిపోయేందుకు ప్రయత్నించిన వరుడు ఇప్పుడు పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంతం ఒక యువతి సిర్సా పోలీసులకు ఒక ఫిర్యాదు చేసింది. దానిలో తనకు ఆరు నెలల క్రితం కెనడాలో ఉంటున్న ఒక యువకునితో ఆన్‌లైన్ వేదికగా పరిచయం అయ్యిందని, ఆ తరువాత ఇద్దరం ఫోనులో పలుమార్లు మాట్లాడుకున్నామని, కుటుంబ సభ్యుల సమ్మతితో ఇద్దరికీ వివాహం కూడా జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. 

నవంబరు 18న ఆ యువకుడు సిర్సా వచ్చాడని, అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం జరిగిందని తెలిపారు. అయితే ఆ తరువాత వరుని తరపువారు రూ. 30 లక్షల కట్నం డిమాండ్ చేయడంతో తమకు అనుమానం వచ్చిందన్నారు. దీంతో వారిని సంప్రదించామని, అయితే వారు ఫోనులో అందుబాటులోకి రాలేదన్నారు. ఫలితంగా తాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నానని బాధితురాలు పేర్కొంది. ఈ సందర్భంగా సిర్సా సివిల్ లైన్ సోలీస్ స్టేషన్ హెడ్ రామ్ నివాస్ మాట్లాడుతూ సిర్సాలోని న్యూ హౌసింగ్ బోర్డ్‌కు చెందిన ఒక యువతి తన కుటుంబంతో పాటు వచ్చి.. ఆమెకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా తాము పోలీసుల బృందాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పంపించామన్నారు. అక్కడ నిందితుడు సాహిల్ ఖురానాను అరెస్టు చేశామన్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. కాగా బాధితురాలు ఆ యువకునితో పాటు అతని తల్లిదండ్రులు, అతని అక్క, బావలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement