Viral Video: పెళ్లి అవగానే వరుడు చేసిన ఓ పనికి ముసిముసి నవ్వులు నవ్విన వధువు

ABN , First Publish Date - 2021-11-08T02:44:53+05:30 IST

ఆ యువకుడు ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. అమ్మాయికి కూడా అతడు నచ్చడంతో ఇరు కుటుంబ సభ్యులు.. వారికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ మూహూర్తం పెట్టారు.

Viral Video: పెళ్లి అవగానే వరుడు చేసిన ఓ పనికి ముసిముసి నవ్వులు నవ్విన వధువు

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువకుడు ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. అమ్మాయికి కూడా అతడు నచ్చడంతో ఇరు కుటుంబ సభ్యులు.. వారికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ మూహూర్తం పెట్టారు. దీంతో తాజాగా వారు.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే.. పెళ్లి సందర్భంగా ఆ యువకుడు చేసిన ఓ పని నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇంతకీ విషయం ఏంటి అనే వివరాల్లోకి వెళితే..



ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తనతో జీవితాంతం ఆనందంగా గడపాలని ప్రతి ఒక్క యువకుడు కలలు కంటాడు. అందరిలాగే ఓ యువకుడు కూడా తన పెళ్లికి గురించి ఎన్నో ఊహించుకున్నాడు. ఈ క్రమంలోనే మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఎదురు చూశాడు. తాజాగా తన కలల రాణి అతడికి తారసపడింది. ఆ అమ్మాయికి కూడా అతడు నచ్చడంతో.. వారికి పెళ్లి చేసేందకు కుటుంబ సభ్యులు రెడీ అయ్యారు. ఓ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.


దీంతో అతడు ఎన్నో రోజులుగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకలో వధువు.. అతడి మెడలో పూలమాల వేసింది. అనంతరం అతడు కూడా ఆమె మెడలో పూలదండ వేశాడు. సరిగ్గా అప్పుడే.. సాంగ్స్ ప్లే అవడంతో.. వరుడు పట్టరాని సంతోషంతో చిందులేశాడు. అదిచూసి వధువుతోపాటు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత అతడి డ్యాన్స్ చూసి, వధువు ముసిముసి నవ్వులు నవ్వింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 




Updated Date - 2021-11-08T02:44:53+05:30 IST