ఎండు గడ్డికి యమ డిమాండ్‌

ABN , First Publish Date - 2020-12-04T04:53:40+05:30 IST

ఎండుగడ్డే కదా అని వది లేసే రోజులు పోయాయి. ఒకప్పుడు మాసూళ్లు అయిన తరువాత వరి చేలల్లోనే గడ్డి వదిలేసేవారు.

ఎండు గడ్డికి యమ డిమాండ్‌
గడ్డి ట్రాక్టర్‌

నిడమర్రు, డిసెంబరు 3 : ఎండుగడ్డే కదా అని వది లేసే రోజులు పోయాయి. ఒకప్పుడు మాసూళ్లు అయిన తరువాత వరి చేలల్లోనే గడ్డి వదిలేసేవారు. లేదంటే పాడి  రైతులకు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు గడ్డే బంగారమైంది. ఎక్కడా ఎండు గడ్డి దొరికే పరిస్థితి లేదు. రైతులను బతిమలాడి మరీ అధిక ధర చెల్లించి కొనాల్సి వస్తోంది. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు, వరదల కారణంగా జిల్లావ్యాప్తంగా వరి పొలాలు నీట మునిగాయి. ముఖ్యంగా కొల్లేరు ఆయకట్టు మండలాలైన నిడ మర్రు, ఉంగుటూరు, భీమడోలు, ఏలూరు రూరల్‌, పెదపాడు, ఆకివీడు, ఉండి మండలాల్లో సుమారు పది వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఎర్రకాల్వ ఆయకట్టులో తాడే పల్లిగూడెం, నిడదవోలు, తణుకు, గణపవరం, అత్తిలి, భీమ వరం రూరల్‌ మండలాల్లో వందలాది ఎకరాల్లో వరిచేలన్నీ ముంపునకు గురై తిండి గింజలు దక్కే పరిస్థితి లేదు. డెల్టాలోని ప్రధాన వరి ఆయకట్టు ప్రాంతాలన్నీ వరద ముంపులో ఉండ డం వల్ల చేలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ చేలల్లో  ధాన్యం దిగుబడిలేక గడ్డి తడిసి కుళ్లిపోయింది.


గడ్డి అధరహో..

పంటలు పాడవడంతో రైతన్నలు పూర్తిగా దెబ్బతిన్నారు. జిల్లాలో సుమారు 2 లక్షల హెక్టార్లలో సార్వా సాగవు తుండగా డెల్టా ప్రాంతంలో సుమారు 1.25 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వర్షాలకు సుమారు 21 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని వ్యవసాయశాఖ అధికా రులు చెబుతున్నారు. పంట దెబ్బతిన్నా కోతలు మాత్రం ఆగలేదు.ఎండు గడ్డి కొరత కారణంగా డిమాండ్‌ ఏర్పడి ంది.తిండి గింజలు దక్కకపోయినా పాడి పశువులకు రైతుల అధిక ధర చెల్లించి ఎండుగడ్డి కొనుగోలు చేసు కుంటున్నారు. గతేడాది ఎకరా ఎండుగడ్డి వెయ్యి రూపా యలు ఉంటే నేడు మూడు వేల పైచిలుకే పలుకుతోంది. ట్రాక్టరు ఎండుగడ్డి కొనాలంటే కూలి, కిరాయి ఖర్చులతో కలిపి రూ.10 వేలు అవుతోంది. దిగు బడుల్లేక నానా అవస్థలు పడుతున్న రైతులు ఎండుగడ్డి కోసం కాస్త ఖర్చు ఎక్కువైనా కూలీల సాయంతో కోతలు కోయిస్తున్నారు. గతంలో వరి కోత యంత్రాలతో కోసిన గడ్డిని రైతులు పశువులకు మేతగా వేసేవారు కాదు. కానీ నేడు గడ్డికి కొరత ఏర్పడడంతో వాటికి డిమాండ్‌ ఏర్పడింది. 


ఎకరా గడ్డి రూ.3 వేలు : ఏసుబాబు, కౌలు రైతు, గణపవరం 

ఈ ఏడాది వర్షాలు,వరదల వల్ల ఆయకట్టు భూములన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి.తిండి గింజలు దక్కలేదు.పశుపోషణ నిమిత్తం ఒకప్పుడు ఊరికే దొరికే ఎండుగడ్డి నేడు ఎకరానికి మూడు వేలకు కొనాల్సి వస్తోంది. 


ట్రాక్టరు గడ్డి రూ.10 వేలు : సూర్యచంద్రరావు, నందమూరు  

పాడి పశువులకు అధిక ధరైనా చెల్లించి వేరే ప్రాంతం నుంచి ఎండుగడ్డి కొని తెచ్చుకొంటున్నాం. ట్రాక్టరుకు రెండు ఎకరాల ఎండుగడ్డి వస్తుంది. ఖర్చులన్నీ కలుపుకుని ఇంటికి చేరేటప్పటికి రూ.10 వేలు అవుతోంది. 


Updated Date - 2020-12-04T04:53:40+05:30 IST