వ్యక్తిగత వాహనాలకు పెరగనున్న గిరాకీ

ABN , First Publish Date - 2020-05-25T05:59:27+05:30 IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భయంతో దేశంలో వ్యక్తిగత ప్రయాణికుల వాహనాలకు గిరాకీ పెరగనుంది. ఆర్టీసీ, రైళ్లు వంటి ప్రజారవాణా వ్యవస్థల్లో ప్రయాణించేందుకు ప్రజలు భయపడడమే ఇందుకు కారణం.

వ్యక్తిగత వాహనాలకు పెరగనున్న గిరాకీ

కొవిడ్‌-19తో మారుతున్న అభిరుచులు


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ భయంతో దేశంలో వ్యక్తిగత ప్రయాణికుల వాహనాలకు గిరాకీ పెరగనుంది. ఆర్టీసీ, రైళ్లు వంటి ప్రజారవాణా వ్యవస్థల్లో ప్రయాణించేందుకు ప్రజలు భయపడడమే ఇందుకు కారణం. దీనికి తోడు ఈ వాహనాల్లో ప్రయాణించేటప్పు డు సామాజిక దూరం పాటించాల్సి రావడం, పాటించినా ఎక్కడ కొవిడ్‌-19 కాటేస్తుందోనన్న భయాలు చాలా మందిని వెంటాడుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తక్కువ ధర ఉండే చిన్న సైజు ఎంట్రీ లెవల్‌ కార్లకు గిరాకీ ఏర్పడుతుందని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  (మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాస్తవ అంటున్నారు. ప్రజల కొనుగోలు శకి తగ్గ డం కూడా ఎంట్రీ లెవల్‌ కార్లకు డిమాండ్‌ పెంచుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.


యూజ్డ్‌ కార్లకూ డిమాండ్‌

కొవిడ్‌-19తో ప్రజా రవాణాతో పాటు షేర్డ్‌ మొబిలిటీకీ చెక్‌పడనుంది. దీంతో ఎంట్రీ లెవల్‌  కార్లతో పాటు ఇంకా తక్కువ ధరలో వచ్చే యూజ్డ్‌ కార్లకూ డిమాండ్‌ పెరుగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇక్కడ కూడా కొనుగోలుదారులు బ్రాండ్‌నేమ్‌ కంటే మంచి నిర్వహణతో చూసేందుకు బాగా ఉన్న కార్లనే ఎంచుకుంటారని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ చెప్పారు. 

తక్కువ ధరలో ఉండే ఎంట్రీ లెవల్‌ కార్లకు కొద్దిగా డిమాండ్‌ పెరిగినా ఈ ఏడాది పరిశ్రమకు నిరాశ తప్పదని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. జీఎ్‌సటీ తగ్గించడం వంటి చర్యలు ప్రకటిస్తే తప్ప అమ్మకాలు పుంజుకునే అవకాశం లేదని అంచనా వేస్తున్నాయి.

Updated Date - 2020-05-25T05:59:27+05:30 IST