Abn logo
Jul 6 2020 @ 05:44AM

పెరుగుతున్న గోదావరి

దేవీపట్నం, జూలై 5: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేవీపట్నం, కొండమొదలు పరిసర గ్రామాలైన నడిపూడి, తెలిపేరు, కచ్చులూరు తదితర గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి గోదావరి నెమ్మదినెమ్మదిగా పెరుగుతుంది.  ఇటీవలే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శబరి, తదితర నదులకు వర్షపు నీరు చేరడంతో గోదావరి క్రమేపీ పెరుగుతుంది. ఈ నెల 10వ తేదీ నాటికి  భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు సుమారు 30-35 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు పలు గ్రామాలకు సమాచారం అందించినట్లు తెలిసింది. 

Advertisement
Advertisement
Advertisement