మొక్కల ఆధారిత ప్రొటీన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-07-09T00:51:03+05:30 IST

దేశంలో మొక్కల ఆధారిత డైట్‌కు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా జంతు ఆధారిత ఉత్పత్తుల వినియోగం గణనీయంగా

మొక్కల ఆధారిత ప్రొటీన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం

న్యూఢిల్లీ: దేశంలో మొక్కల ఆధారిత డైట్‌కు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా జంతు ఆధారిత ఉత్పత్తుల వినియోగం గణనీయంగా తగ్గుతోంది. అయితే, మాంసం, పాల ఉత్పత్తులలో  అధిక మొత్తంలో ప్రొటీన్‌ లభిస్తున్న వేళ  మొక్కల ఆధారిత డైట్ వల్ల తగినంత ప్రొటీన్ లభిస్తుందా? లేదా? అన్న ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది.


నిజానికి మన వంటింట్లో కనిపించే  పప్పులు, బాదములు, తృణధాన్యములలో అధిక మొత్తంలో  ప్లాంట్‌ ప్రొటీన్‌ ఉంటుంది. వీటిని మన ఆరోగ్య, సంపూర్ణమైన డైట్‌లో భాగంగా తరుచూ తీసుకోవచ్చు. ఉదాహరణకు బాదములు. ఇవి పౌషకాల గని మాత్రమే కాదు వినియోగపరంగా వైవిధ్యమైనది. విభిన్న రకాల డిష్‌లకు వినూత్నమైన టెక్చర్‌‌నూ ఇది జోడిస్తుంది. అది స్వీట్‌ అయినా రుచికరమైన పదార్ధం ఏదైనా సరే సరికొత్త రుచులను అందిస్తుంది. బాదములలో అత్యద్భుతమైన రీతిలో ప్లాంట్‌ ప్రొటీన్‌ ఉంటుంది.  దీనిని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. వాటిలో బాదం పాలు, బాదం పిండి, ముడి బాదములు, వేయించిన బాదములు, కొద్దిగా ఉప్పు జోడించిన బాదములు ఇలా ఉంటాయి.


బాదాముల ఉపయోగంపై న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ..కణజాలం, కండరాలు ఏర్పడడానికి హార్మోన్లు, ఎంజైమ్‌లు సమతుల్యతతో ఉండటానికి ప్రొటీన్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. శరీరంలో కణాలు, కణజాలం కోలుకునేందుకు సైతం ఇది తోడ్పడుతుందన్నారు. మొక్కల ఆధారిత డైట్‌ను అనుసరించాలనుకుంటే తొలుత అత్యంత జాగ్రత్తగా డైట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ రోజువారీ కాల్షియం అవసరాలను పాల ఉత్పత్తుల నుంచి పొంది ఉంటే ఇప్పుడు దానిని రాగి, సోయాబీన్‌, ఆకు కూరలు, బాదములు నుంచి పొందవచ్చని వివరించారు. బాదములు లాంటి గింజలు, పప్పులు, కందిపప్పు,  పెసరపప్పు లాంటి పప్పులు శరరీ ప్రొటీన్‌ అవసరాలను తీరుస్తాయని పేర్కొన్నారు. స్నాక్‌గానూ బాదాములు అద్భుతంగా ఉంటాయన్నారు.  మరీముఖ్యంగా భోజనానికి భోజనానికి మధ్య ఆకలితో ఉంటే ఇది తోడ్పడుతుందన్నారు. బాదములలో ప్రొటీన్‌ అధిక మొత్తంలో ఉంటుందని, మజిల్‌మాస్‌‌ను వృద్ధి చేయడంలో అత్యంత కీలకమైన పోషకగా ఈ ప్రొటీన్ నిలుస్తుందని షీలా కృష్ణస్వామి వివరించారు.


మొక్కల ఆధారిత జీవనశైలి, ఆహార పద్ధతులుపై ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌, సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ..  ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఎంతోమంది తనను ఒక డైట్‌ ఫాలో కావాలా? లేదంటే మరోటి ఫాలో కావాలా? అని అడుగుతుంటారని పేర్కొన్నారు.  సమతుల ఆహారం తీసుకోవడమనేది అత్యంత కీలకమని అన్నారు.  మొక్కల ఆధారిత డైట్స్‌ శరీరంలో కొవ్వు తగ్గించడంతో పాటు అధిక బరువు, ఊబకాయులలో అధిక కొవ్వును కరిగిస్తాయని  ఓ అధ్యయనం వెల్లడించిందని, దానిని బట్టి చూస్తే బరువు నియంత్రణలో ఉంచుకునేందుకు మొక్కల ఆధారిత ఆహారం ఎంతో సహాయపడుతుందని తాను విశ్వసిస్తానని అన్నారు. బాదంపప్పులాంటి గింజలలో ప్రొటీన్‌ అధికమొత్తంలో ఉంటుందన్నారు.  దీనికి ఎలాంటి ప్రిపరేషన్‌ అవసరం లేదని,  ఓ గుప్పెడు బాదములు ఆకలి తీర్చడంతో పాటు కడుపు నిండిన అనుభూతి సైతం కలిగిస్తుందని వివరించారు.  ఓ గిన్నెడు క్వినోవాను కాస్త బాదములు జోడించి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చని తెలిపారు.


సుప్రసిద్ధ భారతీయ టెలివిజన్‌,  సినీ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ.. తాను ప్రొటీన్ అధికంగా ఉండే డైట్‌ను ఎక్కువగా తీసుకుంటానని పేర్కొన్నారు.  దీనిలో గుడ్లు,  బాదంపప్పు, పాలు, పప్పులు ఉంటాయన్నారు. ప్రయాణ సమయంలో కూడా  ఆరోగ్యవంతమైన స్నాక్‌ను  తినాలనుకుంటే బాదాములు ఆ కోరికను తీరుస్తాయన్నారు. తన డైట్‌లో ప్రతి రోజూ వాటిని తప్పనిసరిగా భాగంగా చేసుకుంటుంటానని వివరించారు. బాదాములలో ప్రొటీన్, మెగ్నీషియం, విటమిన్‌-ఈ, జింక్‌ ఇతర కీలకమైన పోషకాలు ఉంటాయన్నారు. ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదాములు తినడం వల్ల సహజసిద్ధమైన ప్రొటీన్‌ను పెంచుకోవచ్చని నిషా గణేష్ వివరించారు. 


Updated Date - 2022-07-09T00:51:03+05:30 IST