ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే అభివృద్ధి

ABN , First Publish Date - 2020-07-07T10:38:22+05:30 IST

ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికి అందినప్పుడే అభి వృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే అభివృద్ధి

జైపూర్‌, జూలై 6: ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికి అందినప్పుడే అభి వృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ పేర్కొన్నారు. ఎంపీపీ  రమాదేవి అధ్యక్షతన సోమవారం జరిగిన మండల సమావేశంలో ఎంపీ వెంకటేష్‌నేత, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీలు హాజరయ్యారు.  ప్రతీ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నారు. ఉపాధిహామీ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరం చేయాలని సూచించారు.


ఎంపీ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రైతుబీమా, రైతుబంధు కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారన్నారు. పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విప్‌ బాల్క సుమన్‌ ప్రారంభించారు. కేజీబీవీ బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. జడ్పీటీసీ సునీత,  వైస్‌ఎంపీపీ రమేష్‌, తహసీల్దార్‌ ప్రసాద్‌వర్మా, ఎంపీడీవోనాగేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు,ఎంపీటీసీ పాల్గొన్నారు. 


భీమారం మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి 

భీమారం: భీమారం మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు.  ఎంపీపీ చెరుకు దీపికారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సమావేశానికి ఎంపీ, జడ్పీ చైర్‌పర్సన్‌ పాల్గొన్నారు. విప్‌ సుమన్‌ మాట్లాడుతూ మండలాన్ని తాను ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేశానన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందడానికి ఎంపీడీవో, సర్పంచులు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండల కేంద్రంలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తానని తెలిపారు. జడ్పీటీసీ తిరు మల, వైస్‌ ఎంపీపీ సమ్మయ్య, సర్పంచు రాంరెడ్డి, ఎంపీటీసీ సరోజ, పెద్దల రూప పాల్గొ న్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ఊర చెరువులోని పిచ్చి మొక్కలను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు.  

Updated Date - 2020-07-07T10:38:22+05:30 IST