Abn logo
Sep 26 2021 @ 14:10PM

జీఎస్‌టీ రీఫండ్ క్లెయిమ్స్‌... ఆధార్ ధృవీకరణ తప్పనిసరి

హైదరాబాద్ : పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ రిఫండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పాన్ నంబర్‌కు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల్లోనే జీఎస్‌టీ రీఫండ్స్ వేసేలా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. పన్ను ఎగవేతల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందుకుగాను జీఎస్‌టీకి సంబంధించి వివిధ నిబంధనల్లో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ (సీబీఐసీ) సవరణలు చేసింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


సెప్టెంబరు 17న జరిగిన జజీఎస్‌టీ మండలి భేటీలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీబీఐసీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అలాగే వ్యాపారులు జీఎస్‌టీ వివరాలు సమర్పించే జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్ దాఖలు చేయడాన్ని ఒక్క నెల ఆపివేసినా, ఆ తదుపరి నెలకు బజీఎస్టీఆర్-1 విక్రయాల రిటర్న్ దాఖలు చేసే వీలుండదని కూడా గతీంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 


వచ్చే ఏడాది జనవరి ఒకటి నుండి దీనిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం జీఎస్‌టీఆర్-3బీని రెండు నెలల పాటు దాఖలు చేయకుంటే జీఎస్‌టీఆర్-1 ను సమర్పించడానికి వీలులేదు. వచ్చే ఏడాది నుండి దీనిని ఒక నెలకు తగ్గిస్తున్నారు. ఇందుకు కేంద్ర జీఎస్‌టీ నిబంధనల్లోని 59(6)ను సవరణ చేస్తున్నారు. ఒక నెలలో చేసిన విక్రయాల వివరాలతో జీఎస్‌టీఆర్-1 ను మరుసటి నెల 11 వ తేదీ వరకు వ్యాపారులు దాఖలు చేస్తారు. జీఎస్‌టీ వివరాలతో జీఎస్‌టీఆర్-3బీని మరుసటి నెల 20-24 రోజుల మధ్య సమర్పించి, జీఎస్‌టీని చెల్లిస్తారు.