ఈనెల 25 నుంచి ‘జిల్లా జిల్లాలో కేంద్ర జీఎస్టీ మీ వద్దకు’

ABN , First Publish Date - 2020-02-22T22:24:56+05:30 IST

జీఎస్టీ పన్నుల విధానం అమలులోకి వచ్చాక ఇటు వ్యాపారుల్లోనూ, వ్యక్తులు, వివిధ సంస్థలకు ఈ విధానంపై అనేక అనుమానాలు ఉన్నాయి.

ఈనెల 25 నుంచి ‘జిల్లా జిల్లాలో కేంద్ర జీఎస్టీ మీ వద్దకు’

హైదరాబాద్‌: జీఎస్టీ పన్నుల విధానం అమలులోకి వచ్చాక ఇటు వ్యాపారుల్లోనూ, వ్యక్తులు, వివిధ సంస్థలకు ఈ విధానంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రత్యేకించి ప్రభుత్వం వసూలుచేస్తున్న పన్నుల విధానంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నాయి. ఈనేపధ్యంలో పన్నుచెల్లింపు దారుల అనుమానాలను, ఇబ్బందులను నివృత్తి చేసేందుకు కేంద్ర జీఎస్టీ అధికారులు రాష్ర్టాల వారీగా పన్ను చెల్లింపు దారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌ నగరంలోనూ పన్నుచెల్లింపు దారులతో సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. ‘ జిల్లాజిల్లాలో కేంద్ర జీఎస్టీ మీ వద్దకు’ అన్న నినాదంతో ఈనెల 25వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈనెల 25న తెలంగాణ టాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌తో సమావేశం నిర్వహించనున్నారు. నగరంలోని గన్‌ఫౌండ్రిలో ఉన్నసూర్యలోక్‌ కాంప్లెక్స్‌లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ సమావేశం ఉంటుంది. ఇక 27వ తేదీన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జ్యూయలర్స్‌ వ్యాపారులతో సమావేశం ఉంటుంది. నగరంలోని అబిడ్స్‌లోని ట్వీన్‌సిటీస్‌ జ్యూయలర్స్‌ అసోసియేషన్‌తో సమావేశం ఉంటుంది. అలాగే 28వ తేదీన ఫిలిం ఇండస్ర్తీ, వారి సంఘాలతో సమావేశం ఉంటుంది. ఫిలిం నగర్‌లోని డా.రామానాయుడు బిల్డింగ్‌ కాంప్లెక్స్‌లో ఈ సమావేశం జరుగుతుంది. మార్చి2న ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కామర్స్‌అండ్‌ ఇండస్ర్టీతో సమావేశం ఉంటుంది. ఈసమావేశం బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ర్టేటివ్‌స్టాఫ్‌ కాలేజీ (ఆస్కీ)లో నిర్వహిస్తున్నారు. ఇక మార్చి 3వతేదీన డ్రగ్స్‌ మనుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌తో జీఎస్టీ అధికారులు సమావేశం కానున్నారు. బేగంపేటలోని దిప్లాజా హోటల్‌లో సమావేశమవుతారు. అలాగే మార్చి 4న క్రెడాయ్‌తో బంజారాహిల్స్‌లోని క్రెడాయ్‌ భవనంలో సమావేశమవుతారు. మార్చి5వ తేదీన కన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ర్టీ తో  కొండాపూర్‌లోని గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌లో ఈసమావేశం ఉంటుంది.  

Updated Date - 2020-02-22T22:24:56+05:30 IST