Advertisement
Advertisement
Abn logo
Advertisement

చేనేత వసా్త్రలపై జీఎస్టీని రద్దు చేయాలి

మోత్కూరు, డిసెంబరు 8: చేనేత వసా్త్రలపై ప్రభుత్వం విధించిన 12 శాతం జీఎస్టీని రద్దు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేనేత కార్మికులు నిర్వహించిన ధర్నాలో ఆ యన పాల్గొని మాట్లాడారు. చేనేత వసా్త్రలు అమ్ముడు పోక, చేయడానికి పని లేక  కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో ఉన్న 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని తాము పోరాడుతుంటే  12శాతం పెంచడం దారుణమని అన్నారు. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, నూలుపై ఇస్తున్న 40 శాతం ప్రభుత్వ రాయితీ ప్రతి నెలా కార్మికునికి అందేలా నిబంధనలు సడలించాలని కోరారు. చేనేత కార్మికునికి పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.24 వేలు ఇవ్వాలని కోరారు. అనంతరం డీటీ మల్లిఖార్జునకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య, జిల్లా కార్యదర్శి జెల్ది రాములు, రహీంఖానపేట సంఘం అధ్యక్షుడు కొక్కుల సత్యనారాయణ, పద్మశాలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోచం కన్నయ్య, వేముల నర్సయ్య, బీఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌, మత్స్యగిరి, జె.సోమయ్య, లక్ష్మయ్య, సత్యనారాయణ, శ్రీను, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement