ఆధార్‌ తరహాలో జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌!

ABN , First Publish Date - 2020-11-23T06:29:20+05:30 IST

వస్తు, సేవల పన్ను(జీఎ్‌సటీ) నెట్‌వర్క్‌లో వ్యాపారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత పటిష్ఠం చేసేందుకు జీఎ్‌సటీ మండలి న్యాయ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. నకిలీ ఇన్వాయి్‌సలను అరికట్టేందుకు ఆధార్‌ తరహాలో ఆన్‌లైన్‌లో జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టాలని...

ఆధార్‌ తరహాలో జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌!

  • వ్యాపారి లైవ్‌ ఫొటో, బయోమెట్రిక్‌ల సేకరణ
  • జీఎ్‌సటీ మండలి న్యాయ కమిటీ ప్రతిపాదన 

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎ్‌సటీ) నెట్‌వర్క్‌లో వ్యాపారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత పటిష్ఠం చేసేందుకు జీఎ్‌సటీ మండలి న్యాయ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. నకిలీ ఇన్వాయి్‌సలను అరికట్టేందుకు ఆధార్‌ తరహాలో ఆన్‌లైన్‌లో జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టాలని.. ఇందుకోసం వ్యాపారి లైవ్‌ ఫొటో, బయోమెట్రిక్‌లను సేకరించాలని కమిటీ సూచించింది. బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, జీఎ్‌సటీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు వెసులుబాటు కల్పించాలని అంటోంది. మరిన్ని కీలక సూచనలు.. 

  1. ఒకవేళ వ్యాపారి నాన్‌-ఆధార్‌ ధ్రువీకరణ ప్రక్రియను ఎంచుకోవడంతోపాటు ఐటీ రిటర్నులు సమర్పించలేని పక్షంలో వ్యాపారి కార్యాలయం లేదా వ్యాపార చిరునామాను తప్పనిసరిగా భౌతికంగా తనిఖీ చేయాలి. అంతేకాదు, రిజిస్ట్రేషన్‌ సమయంలో వ్యాపారి ఇద్దరు పన్ను చెల్లింపుదారుల సిఫారసు లేఖలను కూడా సమర్పించాలి. 
  2. సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా వ్యాపారి నమ్మదగిన జాబితాలోకి వస్తే, 7 రోజుల్లో జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ గుర్తింపు ఇవ్వాలి. నమ్మదిగిన జాబితాలోకి రాని పక్షంలో 60 రోజుల్లో, అదీ భౌతిక తనిఖీలు జరిపిన తర్వాతే షరతులతో కూడిన జీఎస్‌టీ గుర్తింపునివ్వాలి. 

Updated Date - 2020-11-23T06:29:20+05:30 IST