ఎస్‌ఎంఎస్‌ ద్వారా జీఎస్‌టీ నిల్‌ రిటర్న్‌ ఫైలింగ్‌

ABN , First Publish Date - 2020-06-29T06:05:34+05:30 IST

ఎలాంటి జీఎ్‌సటీ పన్ను (నిల్‌) చెల్లించాల్సిన అవసరం లేని వ్యక్తులు, సంస్థల కోసం ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. పన్ను చెల్లింపుదారులు.. తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నుంచి 14409 నంబరుకు...

ఎస్‌ఎంఎస్‌ ద్వారా జీఎస్‌టీ నిల్‌ రిటర్న్‌ ఫైలింగ్‌

న్యూఢిల్లీ: ఎలాంటి జీఎస్‌టీ పన్ను (నిల్‌) చెల్లించాల్సిన అవసరం లేని వ్యక్తులు, సంస్థల కోసం ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. పన్ను చెల్లింపుదారులు.. తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నుంచి 14409 నంబరుకు ఎస్‌ఎంఎస్ను పంపించటం ద్వారా తమ నెలవారీ లేదా త్రైమాసిక అమ్మకాల నిల్‌ స్టేట్‌మెంట్లను జీఎస్టీఆర్‌-1 ఫారమ్‌ ద్వారా  సబ్‌మిట్‌  చేయవచ్చు. జూలై మొదటి వారం నుంచి ఈ సౌకర్యం అమల్లోకి వస్తుందని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) తెలిపింది. ప్రస్తుతం వీరు జీఎ స్‌టీ కామన్‌ పోర్టల్‌లోని తమ ఖాతాకు లాగిన్‌ అయి, బయటికి పంపే (అవుట్‌ వార్డ్‌ స్టేట్‌మెంట్‌) తమ నెలవారీ లేదా త్రైమాసిక అమ్మకాల స్టేట్‌మెంట్లను జీఎ్‌సటీఆర్‌-1 ఫారమ్‌లో దాఖలు చేయాల్సి వస్తోంది. 


Updated Date - 2020-06-29T06:05:34+05:30 IST