Abn logo
Sep 19 2021 @ 02:15AM

జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ నిబంధనల్లో మార్పులు

>
  • న్యూఢిల్లీ : జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి వ్యాపారులు ఏదైనా నెలలో విక్రయాల సంక్షిప్త రిటర్న్‌ (జీఎ్‌సటీఆర్‌-3బీ) సమర్పించడంతో పాటు జీఎ్‌సటీ చెల్లించని పక్షంలో ఆపై నెలలో విక్రయాల సమగ్ర వివరాల రిటర్ను (జీఎ్‌సటీఆర్‌-1)ను ఫైల్‌ చేయలేరు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రెండు నెలలపాటు జీఎస్‌టీఆర్‌-3బీ సమర్పించని పక్షంలోనే ఆపై నెలలో జీఎ్‌సటీఆర్‌-1 ఫైలింగ్‌కు వీలుండదు. వ్యాపారులు ఒక నెలకు సంబంధించిన జీఎ్‌సటీఆర్‌-1 రిటర్నును ఆపై నెల 11వ తేదీ నాటికి సమర్పించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపులతో పాటు దాఖలు చేసే రిటర్ను జీఎస్‌టీఆర్‌-3బీని ఆపై నెలలో 20-24 తేదీ వరకు ఫైల్‌ చేయవచ్చు. కాగా,  ఫైలింగ్‌ నిబంధనల కఠినతరంతో పాటు పన్ను ఆదాయ లీకేజీలను అరికట్టేందుకు రిఫండ్‌ క్లెయిమ్‌ల ఫైలింగ్‌కు ఆధార్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేసింది.