Abn logo
Jul 1 2020 @ 00:42AM

నేడు జీఎస్‌టీ దినోత్సవం

హైదరాబాద్‌: జీఎస్‌టీ ప్రవేశపెట్టి మూడు సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారంనాడు హైదరాబాద్‌ సెంట్రల్‌ జీఎస్‌టీ జోన్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా జీఎస్‌టీ డే వేడుకలు నిర్వహిస్తోంది. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన 10 మంది అధికారులను ఈ సందర్భగా జీఎ్‌సటీ కమిషనర్‌  ప్రశంసా సర్టిఫికెట్లతో సత్కరిస్తారని కస్టమ్స్‌, జీఎ్‌సటీ చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్య ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం ఆహూతులైన వాణిజ్య సంఘాల ప్రతినిధులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిస్తారు. జీఎస్‌టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రాంతంలోని పన్ను చెల్లింపుదారులకు ఆమె శుభాకాంక్షలు తెలియచేశారు. 


Advertisement
Advertisement
Advertisement