Abn logo
Sep 19 2020 @ 13:17PM

షూస్‌ ధరించి రాకూడదు.. సచివాలయ అభ్యర్థులకు సూచనలు

Kaakateeya

ప్రతి అభ్యర్థి మాస్క్‌ ధరించాలి.. షూస్‌ ధరించి రాకూడదు

నిమిషం లేటయినా అనుమతి లేదు 

పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు పంపరు.

‘కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటేనే’ నిబంధన లేదు 

1,049 పోస్టులకు 74,711  దరఖాస్తులు

విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ ముత్యాలరాజు


ఏలూరు సిటీ(ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం నుంచి జరిగే గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు చెప్పారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను తనిఖీ చేసేందుకు థర్మల్‌ స్కానర్లు సిద్ధం చేశాం. ప్రతి పరీక్షా కేంద్రంలో రెండు మూడు ఐసొలేషన్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాం గులకు ప్రత్యేక గదులను కేటాయిస్తున్నాం. పరీక్ష సెంటర్లను క్లీనింగ్‌ చేసి సిద్ధం చేస్తున్నాం. కొవిడ్‌ అనుమానిత అభ్యర్థులను థర్మల్‌ స్కాన్‌, పల్స్‌ ఆక్సీమీటర్ల ద్వారా పరీక్షిస్తాం. ముందుగా కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటేనే పరీక్షకు అనుమ తిస్తామనే నిబంధన ఏమీ లేదు. పరీక్షల రోజు ఉదయం ఎనిమిది గంటల నుం చే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలి. షూస్‌ ధరించి రాకూడదు. పరీక్ష అనంతరం ఆన్సర్‌ షీట్‌ కార్బన్‌ కాపీ, ప్రశ్నాప త్రం అభ్యర్థి వెంట తీసుకు వెళ్లవచ్చు. ప్రతీ కేంద్రంలో పీపీఈ కిట్స్‌, మాస్కుల ను అందుబాటులో ఉంచుతాం. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థిని బయటకు పం పించరు. 2019లో 9,515 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేసి 8,466 పోస్టులను భర్తీచేశాం. తాజాగా 1,049 పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఈ నెల 20 నుంచి జరి గే ఈ పరీక్షలకు 74,711 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 29,931మంది పురు షులు, 44,780 మంది మహిళా అభ్యర్థులు ఉన్నార’ని వివరించారు.


పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి

గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలకు ఏ విధమైన లోటు పాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సిబ్బందిని ఆదే శించారు. కలెక్టరేట్‌ నుంచి పరీక్షల నిర్వహణ సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు వివిధ కేటగి రీలలో పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ‘తొలి రోజు ఉదయం పరీక్షకు అత్యధికంగా 34,249 మంది హాజరవుతారని తెలిపారు. ఉదయం పది గంటల పరీక్షకు ఎనిమిది గంటల నుంచి, మధ్యాహ్నం 2.30కు జరిగే పరీక్షకు 12.30 తర్వాత పరీక్ష కేంద్రాలలోకి అనుమతించాలి. కొవిడ్‌ అనుమానిత లక్షణా లున్న వారికి, లేని వారికి వేరు వేరుగా తనిఖీలు, ఽథర్మల్‌ స్కానింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. తనిఖీలు చేసే సిబ్బందికి, ఐసొలేషన్‌ గదులలో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్స్‌ అందజేయాలి. బస్టాండ్‌లు, ఆటో స్టాండ్‌లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. ఆటో యూనియన్ల వారికి పరీక్ష కేంద్రాల వివరాలు అందజేయాలి. ఏజెన్సీ నుంచి వచ్చే అభ్యర్థులకు బస్సులు ముందుగానే స్టార్ట్‌ అయ్యేలా చూడాలి. పరీక్ష కేంద్రం వద్ద వీడియో చిత్రీకరణ చేయాలి. అభ్యర్థి లోపలకు వచ్చే సమయంలో మాస్క్‌ కిందకు లాగి చూడాలి’ అని కలెక్టర్‌ సూచించారు. సమావేశాల్లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షుశుక్లా, జడ్పీ సీఈవో పి.శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ ఉదయభాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement