Abn logo
Jul 14 2021 @ 15:08PM

‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’తో నరాల రుగ్మత.. ఎఫ్‌డీఏ కీలక నిర్ణయం!

వాషింగ్టన్‌, జూలై 13 : జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్న 100మందిలో ‘గ్విలేన్‌ బరీ సిండ్రోమ్‌’ అనే నరాల రుగ్మత తలెత్తినట్లు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. టీకా వేయడానికి ముందు వినియోగదారులకు అందించే ఫ్యాక్ట్‌ షీట్‌లో ‘గ్విలేన్‌ బరీ సిండ్రోమ్‌’ ముప్పు ఉండొచ్చనే హెచ్చరికతో కూడిన లేబుల్‌ను కూడా చేర్చాలని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీని ఆదేశించింది. ‘‘ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత గ్విలేన్‌ బరీ సిండ్రోమ్‌ తలెత్తిన 100 మందిలో 95 మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆ స్పత్రుల్లో చేర్పించాల్సి వచ్చింది. కేవలం ఒక్క వ్యక్తే మృతిచెందాడు. అయితే దుష్ప్రభావానికి వ్యాక్సినే కారణమా అనేది ఇంకా తేలాల్సి ఉంది’’ అని ఎఫ్‌డీఏ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, అమెరికన్లు కరో నా వ్యాక్సిన్‌ మూడో డోసునూ వేసుకోవాల్సి రావచ్చని ఆ దేశ సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తి వెల్లడించారు. 

తాజా వార్తలుమరిన్ని...