Abn logo
Oct 21 2021 @ 00:00AM

కోడిగుడ్లతో గిన్నిస్‌ రికార్డు!

షాపు నుంచి ఒక డజను కోడిగుడ్లు తీసుకురమ్మంటే ఎక్కడ పడిపోతాయోనని హైరానా పడిపోతాం. కానీ ఈ వ్యక్తి ఏకంగా నెత్తిపై 735 కోడిగుడ్లు మోసి అందరినీ ఆశ్చర్యంలో ముంతెత్తాడు. తన ప్రతిభతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కాడు.

  1.  పశ్చిమ ఆఫ్రికాకు చెందిన గ్రెగరీ డ సిల్వాకు స్థానికంగా 
  2. ‘ఎగ్‌మ్యాన్‌’ అని పేరు. కోడిగుడ్లు నెత్తిన పెట్టుకుని ఫీట్స్‌ చేయడం వల్ల ఆయనకు ఆ పేరు స్థిరపడింది. 
  3.  ఇటీవల ఆయన నెత్తిపై ఒక టోపీలాంటి దాంట్లో 735 గుడ్లు పెట్టి కిందపడిపోకుండా చేతులు వదిలేసి మరీ ఫీట్‌ చేశాడు. ఇంకేం... ఆయన చేసిన ఫీట్‌కు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు సైతం ఫిదా అయిపోయారు.