కరోనా థర్డ్‌వేవ్‌పై గుజరాత్ ప్రభుత్వం రోడ్ మ్యాప్

ABN , First Publish Date - 2021-06-15T05:28:04+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌పై గుజరాత్ ప్రభుత్వం రోడ్ మ్యాప్

కరోనా థర్డ్‌వేవ్‌పై గుజరాత్ ప్రభుత్వం రోడ్ మ్యాప్

గాంధీనగర్: కరోనా థర్డ్ వేవ్ రావచ్చునన్న ఊహాగానాల నేపథ్యంలో.. దీన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్టు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. సెకండ్ వేవ్ కారణంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. కరోనా పరీక్షలు, వైద్య సదుపాయాలను పెంచడంతో పాటు.. ఒకవేళ పెద్ద సంఖ్యలో పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఈ ప్రణాళికలో మార్గదర్శకాలు పొందుపర్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సమక్షంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు.

Updated Date - 2021-06-15T05:28:04+05:30 IST