యువతిని ప్రేమ పెళ్లి చేసుకొని మతమార్పిడి చేసిన యువకుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-19T12:26:14+05:30 IST

ఓ యువతిని ప్రేమ పెళ్లి చేసుకొని, బలవంతంగా ఆమెను మత మార్పిడి చేసిన ...

యువతిని ప్రేమ పెళ్లి చేసుకొని మతమార్పిడి చేసిన యువకుడి అరెస్ట్

 వడోదర (గుజరాత్): ఓ యువతిని ప్రేమ పెళ్లి చేసుకొని, బలవంతంగా ఆమెను మత మార్పిడి చేసిన వరుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో వెలుగుచూసింది. వడోదర నగరానికి చెందిన 26 ఏళ్ల సమీర్ ఖురేషి అనే యువకుడు తాను క్రైస్తవుడినంటూ ఓ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడు. అనంతరం యువతిపై అత్యాచారం చేసి, వివాహం చేసుకున్నాక ఆమె పేరును మార్చి మతం మార్చమని బలవంతం చేశాడు. గుజరాత్ రాష్ట్రంలో మత మార్పిడికి వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో మొట్టమొదటిసారి ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. 


నిందితుడు తనపై పలుసార్లు అత్యాచారం చేసి, ఈ  ఏడాది ఫిబ్రవరిలో బలవంతంగా వివాహం చేసుకున్నాడని యువతి ఆరోపించింది. దీంతో వడోదరలోని గోత్రి పోలీసులు నిందితుడైన సమీర్ ఖురేషిపై గుజరాత్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ సవరణ చట్టం 2021 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వివాహం చేసుకొని బలవంతంగా మత మార్పిడి చేస్తే కఠినమైన శిక్ష విధిస్తారు. సమీర్ తాను క్రిస్టియన్ అని, తన పేరు సామ్ మార్టిన్ అని పరిచయం చేసుకొని పెళ్లాడినట్లు తేలింది. 


క్రిస్టియన్ అని సమీర్ తో యువతి పెళ్లాడిందని పోలీసులు  చెప్పారు. యువతిని హోటల్ కు తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసి సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు. మహిళ రెండుసార్లు గర్భం దాల్చిందని, గర్భస్రావం చేయించాడని వెల్లడైంది. పెళ్లి సమయంలో నిఖా వేడుక నిర్వహించాడని దీంతో అసలు విషయం తెలిసిందని మహిళ పోలీసులకు చెప్పారు. 


Updated Date - 2021-06-19T12:26:14+05:30 IST