ఎన్ఐఏ చేతికి ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు విచారణ

ABN , First Publish Date - 2021-10-07T03:30:11+05:30 IST

గుజరాత్ డ్రగ్స్ కేసు విచారణ ఎన్‌ఐఏ చేతికి వెళ్లింది. సెప్టెంబర్ 15న ముంద్రా పోర్టులో రూ.23 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు..

ఎన్ఐఏ చేతికి ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు విచారణ

న్యూఢిల్లీ: గుజరాత్ డ్రగ్స్ కేసు విచారణ ఎన్‌ఐఏ చేతికి వెళ్లింది. సెప్టెంబర్ 15న ముంద్రా పోర్టులో రూ.23 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు డీఆర్ఐ నుంచి ఎన్ఐఏకు బదిలీ అయింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. నార్కోటిక్స్ వ్యవహారంలో విదేశీయుల హస్తం ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఇప్పుడు ఈ కోణంలోనే ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది.  కాగా ఏపీ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా విజయవాడకు చెందిన కంపెనీ చిరునామాతో ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. 


Updated Date - 2021-10-07T03:30:11+05:30 IST