Gujarat: అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది రాజీనామా

ABN , First Publish Date - 2021-09-16T18:46:41+05:30 IST

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది గురువారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు....

Gujarat: అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది రాజీనామా

మంత్రివర్గ విస్తరణకు ముందు...

అహ్మదాబాద్ : గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది గురువారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. గుజరాత్ కొత్త సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు స్పీకర్ రాజేంద్ర త్రివేది రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.వడోదరలోని రావుపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న త్రివేది తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని త్రివేది కోరారు. గుజరాత్ లెజిస్లేచర్ సెక్రటేరియట్ స్పీకర్ త్రివేది రాజీనామాపై నోటిఫికేషన్ విడుదల చేసింది.త్రివేది స్పీకరుగా 2018 ఫిబ్రవరి 19వతేదీన బాధ్యతలు స్వీకరించారు.రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయిన త్రివేది గతంలో క్రీడలు, యువత, సాంస్కృతిక కార్యకలాపాలు, తీర్థయాత్ర అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. గురువారం నాడు ఏర్పాటు కానున్న కొత్త మంత్రివర్గంలో త్రివేదికి చోటు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Updated Date - 2021-09-16T18:46:41+05:30 IST