Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 5 2021 @ 07:48AM

Gujarat: నాలుగు వారాల్లో 33 శాతం పెరిగిన కొవిడ్ కేసులు

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. గుజరాత్ రాష్ట్రంలో కేవలం నాలుగువారాల్లోనే కొవిడ్ కేసుల సంఖ్య 33 శాతం పెరిగింది. సెప్టెంబరు మొదటి వారంలో రోజుకు సగటున 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4వతేదీ వరకు 120 కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రోజుకు 20 కరోనా కేసులు నమోదు కావడంతో కొవిడ్ కేసుల్లో 33 శాతం పెంపు కనిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్ నగరాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అహ్మదాబాద్ నగరంలో అనూహ్యంగా కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది.

 అహ్మదాబాద్ నగరంలో 30 శాతం కరోనా కేసులు పెరిగాయి. పండుగల సీజన్ సందర్భంగా ప్రజలు మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా షాపింగ్ చేయడం వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని అహ్మదాబాద్ హాస్పిటళ్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ భరత్ గధ్వీ చెప్పారు. గత 24 గంటల్లో గుజరాత్ లో 14 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. అహ్మదాబాద్ నగరంలో 6, సూరత్ నగరంలో 4, భావనగర్, వడోదర, వల్సాద్ నగరాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదైనాయి. గుజరాత్ రాష్ట్రంలో 6.2 కోట్ల మంది కొవిడ్ టీకాలు వేయించుకున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement