గులాబ్‌.. గుభేల్‌!

ABN , First Publish Date - 2021-09-29T05:54:37+05:30 IST

గులా బ్‌.. గుండెగుబేల్‌ మనిపించింది..ఒక్కటే వాన ఎక్కడా ఆగలేదు..

గులాబ్‌.. గుభేల్‌!
ఆచంట వేమవరంలో నక్కలకాలువను ఆనుకుని నీట మునిగిన చేలు

నిండా ముంచిన తుఫాన్‌ 

ఇంకా తేరుకోని జనం 

 ముంపులో చేలు 

ఉధృతంగా యనమదుర్రు 

ఆందోళనలో రైతాంగం  


వీరవాసరం/మొగల్తూరు/పాలకొల్లు అర్బన్‌/ ఆచంట, సెప్టెంబరు 28 :  గులా బ్‌.. గుండెగుబేల్‌ మనిపించింది..ఒక్కటే వాన ఎక్కడా ఆగలేదు.. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది.. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువు లుగా మారిపోయాయి.. చేలు నీటితో నిండిపోయాయి. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కుంభవృష్టిగా వానపడింది. పలు చోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడడమే కాకుండా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో డ్రెయినేజీ సదుపాయం లేకపోవడంతో నీరు పల్లపు ప్రాంతాలను ముంచెత్తింది. వీరవాసరం పశ్చిమకాలువ వైపు వెళ్లే వర్షపు నీరు రహదారిపై ప్రవహిస్తూ వీఈసీ జూనియర్‌ కళాశాలలో చేరింది. మరో పక్క మేజర్‌ డ్రెయిన్‌ గొంతేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మైనర్‌, మీ డియం డ్రెయిన్ల నుంచి గొంతేరులోకి నీరు వెళ్లే మార్గం లేక పంట చేలను ముంచుతున్నాయి. ఇదే కొనసాగితే చేలు నీటిముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొగల్తూరు లో ప్రధాన రహదారుల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. మసీదు సెంటర్‌ నుంచి గాంధీ బొమ్మల సెంటర్‌ వరకూ మోకాలి లోతులో నీరు నిలిచింది. పెద్దగొల్లగూడెం, పాతకాలువ సెంటర్‌, పోలీస్‌ స్టేషన్‌ రోడ్డులో కూడా నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. పాల కొల్లు పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రెయినేజీలు పొంగి పొర్లి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.పట్టణంలోని దమ్మయ్యపర్తి డ్రెయిన్‌ పొంగి పొర్ల డంతో రోడ్లపైకి మురుగునీరు చేరింది. పాలకొల్లు పరిసర ప్రాం తాల్లో 52  మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలి పారు.ఆచంట మండలంలో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. పలు పల్లపు ప్రాంతాల్లో నీరు చేరడంతో కొన్ని తాటాకిళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. 


ఉప్పొంగుతున్న యనమదుర్రు


ఉండి/పాలకోడేరు/ భీమ వరం ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 28 : యండగండి వద్ద యన మదుర్రు డ్రెయిన్‌ పొంగిపొర్లు తోంది. వరదనీరు ఉధృతంగా వస్తుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రజలు, రైతులు ఆందోళన చెం దుతున్నారు. లాకుల వద్ద పహ రా కాస్తున్నారు. డ్రెయిన్‌ నీరు వరిచేలలోకి చేరుతుండడంతో  కంగారుపడుతున్నారు. రెవెన్యూ అధికారులు, రైతులు కాలువ గట్లు వెంబడి గస్తీ తిరు గుతు న్నారు.ఉండి మండలం యండ గండి నుంచి గణపవరం మండ లం ఎస్‌.కొందేపాడు వెళ్లే కాజ్‌వే వంతెన ప్రతీ ఏటాలాగే వరదనీటికు మునిగిపోయింది. దాంతో ప్రయా ణికులు,వాహన రాకపోకలు నిలిపి వేశారు.ఉండి మండలంలోని యండగండి లాకుల వద్ద నివసిస్తున్న పల్లపు ప్రాంతాన్ని మంగళవారం తహసీల్దార్‌ కృష్ణజ్యోతి పరిశీలించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ అధికారులకు సూ చించారు. ఉన్నతాధికారులకు ఎప్పటికపుడు సమాచారం అందిస్తున్నట్టు గ్రామ రెవిన్యూ అధికారు లు జయబాబు, బాలకృష్ణ తెలిపారు. యనమదుర్రు ఉధృతి నేపథ్యంలో మంగళవారం తహసీల్దార్‌ ఏ.మధుసూదనరావు గరగపర్రు, మైప గ్రామాల్లో యనమదుర్రు గట్లను పరిశీలించారు.గట్టును చేర్చి ఉంటున్న ప్రజలను అప్రమత్తం చేశారు. భీమవరం తహసీ ల్దార్‌ ఏవి రమణారావు యనమదుర్రు రోడ్‌లో ఉన్న లాకులను పరిశీలించారు.


ముంపు చేలు పరిశీలన


ఆకివీడు/రూరల్‌/పాలకొల్లు రూరల్‌/ నరసాపురం రూరల్‌, సెప్టెంబరు 28 : ప్రకృతి మరోసారి ప్రకోపిం చింది..అన్నదాతను నిలువునా ముంచేసింది. నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలకు సంబంధించి 22,998 ఎకరాలకు 15,016 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఆకివీడు మండలంలో 5,227 ఎకరాలకు గాను 4,005, కాళ్ళ మండలంలో 6,195కు గాను 1,468, ఉండి మండలంలో 11,576కు గాను 9,543 ఎకరాలకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలిపారు. పాలకొల్లు మండలంలో 295 హెక్టార్లలో పంట మునిగినట్టు ఏవో అబ్దుల్‌ రహీం తెలిపారు. నరసాపురం మండలంలోని కొప్పర్రు, మల్లవరం, రుస్తుంబాద గ్రామాల్లో  ముంపుకు గురైన పంట పొలాలను ఏడీఈ డాక్టర్‌ శ్రీనివాసరావు పరిశీలించారు. 




Updated Date - 2021-09-29T05:54:37+05:30 IST