జైలు అధికారులు నన్ను వేధించారు: జామియా విద్యార్థి

ABN , First Publish Date - 2020-09-23T02:29:33+05:30 IST

కోర్టు ముందు ఫాతిమా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దరఖాస్తును కోర్టుకు ఇవ్వమని ఆమె లాయన్‌ను జడ్జ్ సూచించారు. దానికి ఆయన తప్పకుండా ఇస్తానని జడ్జికి తెలిపారు.

జైలు అధికారులు నన్ను వేధించారు: జామియా విద్యార్థి

న్యూఢిల్లీ: తనను జైలు అధికారులు మానసికంగా వేధించారని ఉపా చట్టం కింద అరెస్టైన జామియా విద్యార్థి గుల్ఫిషా ఫాతిమా తెలిపారు. సోమవారం ఢిల్లీ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సమయంలో సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ ముందు ఈ విషయం చెప్పుకుని ఆమె బోరున విలపించారు. జామియా మిలియా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న ఫాతిమాను.. ఢిల్లీ అల్లర్ల కేసులో ఫిభ్రవరిలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె తీహార్‌లో జైలు శిక్ష అనుభవస్తున్నారు.

‘‘నాకు జైలులో చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జైలు అధికారులు, ఉద్యోగుల నుంచి చాలా వివక్షను ఎదుర్కొంటున్నాను. వాళ్లు నన్ను ‘చదువుకున్న ఉగ్రవాది’ (ఎడ్యూకేటెడ్ టెర్రరిస్ట్) అని నిందిస్తున్నాను. అంతే కాకుండా మతతత్వ పరంగా నన్ను వేధిస్తున్నారు. ఇక్కడ చాలా మానసిక వేధింపులకు గురవుతున్నాను. నాకేదైనా జరిగితే అది పూర్తిగా జైలు అధికారులదే బాధ్యత’’ అని కోర్టు ముందు గుల్ఫిషా ఫాతిమా చెప్పుకొచ్చారు.

కోర్టు ముందు ఫాతిమా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దరఖాస్తును కోర్టుకు ఇవ్వమని ఆమె లాయన్‌ను జడ్జ్ సూచించారు. దానికి ఆయన తప్పకుండా ఇస్తానని జడ్జికి తెలిపారు.

Updated Date - 2020-09-23T02:29:33+05:30 IST