Rang De Basanti లో జేమ్స్‌బాండ్.. ఏజెంట్ 007కు విలన్‌గా బాలీవుడ్ నటుడు

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంంది.  యాక్షన్, రొమాన్స్‌గా తెరకెక్కే ఈ చిత్రాలకు చాలామంది అభిమానులున్నారు. ప్రతి జేమ్స్ బాండ్ సినిమాలోను హీరోను ఏజెంట్ 007గా సంభోదిస్తుంటారు. క్యాసినోరాయల్ అనే జేమ్స్‌‌బాండ్  సినిమాలో ఒక బాలీవుడ్ నటుడికి అవకాశం వచ్చింది. కానీ, అనేక కారణాల వల్ల ఆ పాత్రను ఆయన పోషించలేకపోయారు.


బాలీవుడ్ నటుడైన గుల్షన్ గ్రోవర్‌కు ఆ అవకాశం దక్కింది. డేనియల్ క్రేగ్ హీరోగా తెరకెక్కిన క్యాసినో రాయల్ చిత్రంలో విలన్ పాత్ర పోషించే అవకాశం ఆయనకు లభించింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. తాజాగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.‘‘ నాకు క్యాసినో రాయల్ చిత్రంలో విలన్‌గా అవకాశం వచ్చింది. కాంట్రాక్ట్ మీద కూడా సంతకం చేశాను.  నేను ఆ విషయాన్ని లండన్‌లో నివసించే నా సన్నిహత మిత్రుడితో పంచుకున్నాను. లండన్‌లో బిగ్గెస్ట్ న్యూస్ పేపర్ అయిన డైలీ మిర్రర్ ‘బాలీవుడ్స్ బాండ్ విలన్’ అనే స్టోరీని రన్ చేసింది. గత రాత్రి నా స్నేహితుడికి చెప్పిన విషయాలన్ని మీడియాలో ప్రచురితం అయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరు అసంతృప్తి చెందారు. నేను కాంట్రాక్ట్ నిబంధనలకు లోబడి వ్యవహరించలేదన్నారు. అనంతరం అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సినిమా నుంచి విలన్‌గా తప్పుకోవాల్సి వచ్చింది ’’ అని గుల్షన్ గ్రోవర్ చెప్పారు.


తాజాగా బాలీవుడ్ దర్శకుడైన రాకేశ్ ఓం‌ప్రకాశ్ మెహ్రా తన ఆటో బయోగ్రఫీని విడుదల చేశారు. ఆ బయోగ్రఫీలో ఆశ్చర్యకర సంగతులను వెల్లడించారు. రంగ్‌ దే బసంతిలోని ఒక పాత్ర కోసం డేనియల్ క్రేగ్‌ని ఎంపిక చేశామన్నారు. అదే సమయంలో అతడికి బాండ్ సినిమాలో అవకాశం రావడంతో తప్పించాల్సి వచ్చిందన్నారు. 

Advertisement

Bollywoodమరిన్ని...