షూటింగ్‌లో పేలిన తుపాకీ.. సినిమాటోగ్రాఫర్‌ మృతి

ABN , First Publish Date - 2021-10-23T08:14:48+05:30 IST

అమెరికాలోని న్యూమెక్సికోలో శుక్రవారం సినిమా షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ‘రస్ట్‌’ అనే సినిమా కు సంబంధించిన కాల్పుల...

షూటింగ్‌లో పేలిన తుపాకీ.. సినిమాటోగ్రాఫర్‌ మృతి

అమెరికాలో దర్శకుడికి తీవ్రగాయాలు 

సాంటా ఫె (అమెరికా), అక్టోబరు 22: అమెరికాలోని న్యూమెక్సికోలో శుక్రవారం సినిమా షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ‘రస్ట్‌’ అనే సినిమా కు సంబంధించిన కాల్పుల సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రముఖ హాలీవుడు నటుడు అలెక్‌ బాల్డ్‌విన్‌(63) చేతిలోని ప్రాప్‌ గన్‌ అకస్మాత్తుగా పేలిం ది. ఆ బుల్లెట్లు తాకడంతో మహిళా సినిమాటోగ్రాఫర్‌ హలైనా హచిన్స్‌(42), డైరెక్టర్‌ జోయెల్‌ సౌజా (48)లు రక్తపు మడుగులో పడిపోయారు. వెంటనే వారిని హెలికాప్టర్‌ అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హలైనా హచిన్స్‌ మృతిచెందారు. డైరెక్టర్‌ జోయెల్‌ సౌజాకు చికిత్స కొనసాగుతోంది. ప్రాప్‌ గన్‌ పొరపాటున ఫైర్‌ అయిందని సినిమా యూనిట్‌ సభ్యులు చెప్పారు. 

Updated Date - 2021-10-23T08:14:48+05:30 IST