ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి సీఎస్‌లో గన్ మిస్‌ఫైర్

ABN , First Publish Date - 2020-02-23T00:11:32+05:30 IST

ఆసిఫాబాద్ జిల్లా: కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లా, తిర్యాణి పోలీస్ స్టేషన్‌లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది.

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి సీఎస్‌లో గన్ మిస్‌ఫైర్

ఆసిఫాబాద్ జిల్లా: కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లా, తిర్యాణి పోలీస్ స్టేషన్‌లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. కానిస్టేబుల్ చేతిలో ఎస్ఎల్ఆర్ గన్ పేలింది. ఈ ఘటనలో పోలీస్‌‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ కిరణ్ ఇవాళ ఎస్ఎల్ఆర్ గన్‌ను శుభ్రపరుస్తుండగా ఆకస్మాత్తుగా మిస్ ఫైర్ అయింది. ఈ క్రమంలో బుల్లెట్ అతని తలలోకి దూసుకుపోయింది. తీవ్ర రక్తస్త్రావంతో పడిపోయిన అతనిని అక్కడున్న సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రోజువారి విధుల్లో భాగంగానే గన్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ అజాగ్రర్తవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీనిపై జిల్లా ఎస్పీ విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-02-23T00:11:32+05:30 IST