పేదల పక్షపాతి గుండా మల్లేష్‌

ABN , First Publish Date - 2020-10-22T05:51:24+05:30 IST

మాజీ ఎమ్మెల్యే , సీపీఐ రాష్ట్ర నాయకుడు గుండా మల్లేష్‌ చివరి వరకు కమ్యునిస్టుగా జీవించి తన జీవితాంతం పేదల పక్షపాతిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు

పేదల పక్షపాతి గుండా మల్లేష్‌

సంతాప సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ  వెంకట్‌రెడ్డి  


బెల్లంపల్లి టౌన్‌, అక్టోబరు  21: మాజీ ఎమ్మెల్యే , సీపీఐ రాష్ట్ర నాయకుడు గుండా  మల్లేష్‌ చివరి వరకు కమ్యునిస్టుగా జీవించి తన జీవితాంతం పేదల పక్షపాతిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని సింగరేణి కళావేదిక ఆడిటోరియంలో సీపీఐ జిల్లా కార్యదర్శి  కలవేన శంకర్‌ అద్యక్షతన జరిగిన మల్లేష్‌ సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌ ప్రాంతంలో గిరిజనులు,  ఆదివాసీల జీవితాల్లో మల్లేష్‌ చెరగని ముద్ర వేస్తున్నారని ఆయన తెలిపారు. పేద ప్రజల సంక్షేమం, వారి హక్కుల సాధనకు పాటుపడ్డారని చెప్పారు. అందుకు చిహ్నంగా  బెల్లంపల్లిలో గుండా మల్లేష్‌ స్మారక స్థూపం ఏర్పాటు చేయడంతో పాటు ఆయన జ్ఞాపకార్దం ఆయన చరిత్ర గల ఒక పుస్తకాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గుండా మల్లేష్‌  నిత్యం  పేద ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు.


ఈ సభలో కలవేన శంకర్‌ మాట్లాడుతూ గుండా మల్లేష్‌ అకాల మరణంతో సీపీఐ మంచి నాయకుడి కోల్పోయిందని తెలిపారు. అంతకు ముందు గుండా మల్లేష్‌ చిత్రపటానికి  సీపీఐ నాయకు లు పూల మాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా గుండా మల్లేష్‌ పేరున ఆలపించిన విప్లవ గేయాలు ఆకట్టుకున్నాయి.  కార్యక్రమంలో కుమరం భీం జిల్లా సీపీఐ కార్యదర్శి భద్రి సత్యనారాయణ,  కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి కేదారి, బెల్లంపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి, గుండా మల్లేష్‌ భార్య గుండా సరోజన, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి  సబ్బని కృష్ణ,   సింగరేణి జేఏసీ చైర్మన్‌ ఎండీ మున్నీర్‌, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు చిప్ప నర్సయ్య,  దాగం మల్లేష్‌, పూర్ణిమ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ,  సీపీఐ మండల కార్యదర్శి  బొంతల  లక్ష్మీనారాయణ,  మండల సహాయ కార్యదర్శి మేకల రాజేషం,  సీనియర్‌ నాయకుడు రాజిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండి ప్రభాకర్‌ యాదవ్‌, మామిడాల రాజేషం, ఉమ్మడి  ఆదిలాబాద్‌ జిల్లా సీనియర్‌ న్యాయవాది మల్లారెడ్డి, నాయకులు రత్నం రాజం, రత్నం ఐలయ్య, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-22T05:51:24+05:30 IST