గన్నీ బ్యాగులు సేకరించాలి

ABN , First Publish Date - 2021-10-24T04:32:01+05:30 IST

త్వరలో వరి ధాన్యం కోతకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉన్నందున చౌకధర దుకా ణాల డీలర్ల నుంచి గన్నీ బ్యాగులు సేక రించే ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి స్టేజ్‌-2 కాంట్రాక్టర్లను ఆదేశించారు.

గన్నీ బ్యాగులు సేకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి

- అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి


కందనూలు, అక్టోబరు 23: త్వరలో వరి ధాన్యం కోతకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉన్నందున చౌకధర దుకా ణాల డీలర్ల నుంచి గన్నీ బ్యాగులు సేక రించే ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి స్టేజ్‌-2 కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ హాల్లో జిల్లా సివిల్‌ సప్లయ్‌ శాఖ ఆధ్వర్యంలో స్టేజ్‌-2 కాంట్రాక్టర్లు, హమాలీ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నీ బ్యాగుల సేకరణ చేపట్టాలని అదేవి ధంగా చౌకధరల దుకాణాలకు బియ్యం తర లింపులో జాప్యం జరగకుండా సకాలంలో బియ్యం చేరవేసేవిధంగా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. పెద్దకొత్తపల్లి మండ లంలో చాలా జాప్యం జరుగుతున్నట్లు గమచామని, జాప్యాన్ని నివారించి త్వరితగతిన చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి మోహన్‌బాబు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-24T04:32:01+05:30 IST