Abn logo
Aug 1 2020 @ 18:23PM

కంగన రనౌత్ ఇంటివద్ద కాల్పుల కలకలం

సిమ్లా: బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఇంటికి చేరువలో తుపాకీ కాల్పుల చప్పుళ్లు వినపడడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రక్షణ కల్పించారు. వివరాల్లోకి వెళితే.. మనాలీలో కంగన రనౌత్‌కు ఓ సొంత భవంతి ఉంది. ఈ భవంతి సమీపంలో శుక్రవారం ఉన్నట్లుండి తుపాకీతో కాల్పులు జరిపిన చప్పుళ్లు వినిపించాయి. ఆ సమయంలో కంగన ఇంటి లోపలే ఉన్నారు. ఊహించని ఈ సంఘటనతో ఖంగారు పడినప్పటికీ వెంటనే స్థానిక పోలీసులకు ఆమె సమాచారమిచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటన గురించి కంగన మాట్లాడుతూ, తొలుత అవి తుపాకీ చప్పుళ్లు అని అర్థం కాలేదని, అయితే రెండో సారి కూడా వినపడడంతో అర్థం చేసుకున్నానని చెప్పారు. స్థానికులకు డబ్బు ఆశ చూపించి ఎవరో తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని కంగన ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement