గుంట నక్కతో పొంగల్‌ సంబరాలు

ABN , First Publish Date - 2022-01-18T16:51:05+05:30 IST

సేలం జిల్లా చిన్నమనాయకన్‌పాళయం గ్రామంలో పెద్దల మార్గాన్ని అనుసరిస్తూ ప్రాచీన సంప్రదాయం ప్రకారం వేటాడిన గుంట నక్కను గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లి పొంగల్‌ను కోలాహలంగా జరుపుకున్నారు.

గుంట నక్కతో పొంగల్‌ సంబరాలు

ప్యారీస్‌(చెన్నై): సేలం జిల్లా చిన్నమనాయకన్‌పాళయం గ్రామంలో పెద్దల మార్గాన్ని అనుసరిస్తూ ప్రాచీన సంప్రదాయం ప్రకారం వేటాడిన గుంట నక్కను గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లి పొంగల్‌ను కోలాహలంగా జరుపుకున్నారు. వాలప్పాడి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న చిన్నమ నాయకన్‌పాళయం, కొట్టవాడి, రంగనూర్‌ సహా పలు గ్రామాల్లో ధనుర్మాసంలో పంటల కోత అనంతరం తైమాసంలో కొత్త సాగు పనులు చేపట్టక ముందు గుంట నక్కకు పూజలు చేస్తే సకలసౌభాగ్యాలు చేకూరు తాయని గ్రామస్తుల అపార నమ్మకం. అందువల్ల ప్రతి ఏటా పెద్ద పండుగను ఐదురోజులు కోలాహలంగా జరుపుకుంటుంటారు. గుంట నక్క వన్యప్రాణుల జాబితాలో ఉన్నందున్ల అటవీశాఖ దీనిని వేటాడేందుకు అనుమతి నిరాకరించింది. అయినప్పటికి, చిన్నమనాయకన్‌పాళయం గ్రామస్తులు వేటాడిన గుంట నక్కను గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకెళతారు. ఆలయ ప్రాంగణంలో ప్రజలందరికి చూపించిన అనంతరం సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించి సోమవారంతో వేడుకలు పూర్తిచేశారు. అదే సయమంలో నక్కను పట్టుకున్నందుకు వాలప్పాడి రేంజర్‌ దురైమురుగన్‌ నిర్వా హకులపై కేసు నమోదుచేసారు.

Updated Date - 2022-01-18T16:51:05+05:30 IST