సత్తెనపల్లి మున్సిల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-07-30T18:13:42+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్తి , చెత్త పన్నుల పెంపుపై

సత్తెనపల్లి మున్సిల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్తి , చెత్త పన్నుల పెంపుపై సీపీఎం నేతలు నిరసన ప్రదర్శనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్‌లోకి చొచ్చుకొని వెళ్లిన  సీపీఎం నేతలు మున్సిపల్ కౌన్సిల్ హాల్ మెట్లకు అడ్డంగా కూర్చున్నారు. కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లకుండా ఎమ్మెల్యే అంబటికి సీపీఎం నేతలు అడ్డుపడ్డారు. అయితే సీపీఎం నేతలను తొక్కుకుంటూనే ఎమ్మెల్యే అంబటి, వైసీపీ నేతలు కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు తీరుపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు - సీపీఎం నేతలకు మద్య వాగ్వివాదం , తోపులాట చోటు చేసుకుంది. 

Updated Date - 2021-07-30T18:13:42+05:30 IST