గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలం జొన్నలగడ్డ ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 4,944 సీసాల తెలంగాణ మద్యం పట్టుబడింది. లారీతో పాటు మూడు కార్లు, ఒక ఆటోను సెబ్ పోలీసులు సీజ్ చేశారు. మద్యాన్ని తరలిస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.