Abn logo
Jan 14 2021 @ 19:28PM

విద్యుత్ షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

గుంటూరు: జిల్లాలోని వినుకొండ మండలం నరగాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ రామాంజనేయులు(45) మృతి చెందాడు. సచివాలయ నిర్మాణ క్రమంలో గ్రావెల్ తోలుతుండగా విద్యుత్ షాక్‌తో ఈ ఘటన జరిగింది. వ్యక్తి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement