బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హత్య

ABN , First Publish Date - 2021-01-27T18:30:45+05:30 IST

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హత్య

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హత్య

గుంటూరు: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు యాదవ్ హత్యకు గురయ్యాడు. ఈ నెల 20న నాగరాజు యాదవ్ అదృశ్యమైయ్యాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చిలకలూరిపేట సమీపంలో దుండగులు హత్య చేసి దహనం చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-01-27T18:30:45+05:30 IST