Abn logo
Jul 25 2021 @ 15:43PM

గుంటూరు జిల్లా: సర్కార్ బడిలో నాటు సారా తయారీ

గుంటూరు జిల్లా: రేపల్లె నియోజకవర్గంలో అక్రమార్కులు ఏకంగా ప్రభుత్వ పాఠశాలనే నాటు సారా తయారీ కేంద్రంగా మార్చేశారు. నిజాంపట్నం మండలం, పాత హారీస్ పేట ప్రభుత్వ పాఠశాలలో నాటు సారా కాస్తున్నారనే సమాచారంతో అధికారులు దాడిచేశారు. ఈ ఘటనలో గున్నం శివపార్వతిని అదుపులోకి తీసుకున్నారు. 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని, వంద లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అడువుల దీవికి చెందిన ఎర్రోడు, ఆముదాలపల్లికి చెందిన శివయ్య నుంచి నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.